మెగాస్టార్ చిరంజీవి హీరోగా కంటే కూడా ఒక వ్యక్తిగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. మన రాష్ట్రంలో కోవిడ్ కారణంగా అనేకమంది చనిపోయారు. ఈ విషయానికి చలించిపోయిన చిరు తన బ్లడ్ బ్యాంకు ద్వారా కరోనా నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం చెయ్యాలి అని పిలుపును కూడా ఇచ్చారు. అన్న పిలుపుతో ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు ప్లాస్మా దానం చేసారు. నాగబాబుకు కొన్నిరోజుల ముందు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
తాను కరోనా నుండి త్వరగా కోలుకొని అత్యవసర పరిస్థితిలో ఉన్న కరోనా రోగులకు ప్లాస్మా దానం చేస్తానని చెప్పారు. అన్నట్టుగానే నాగబాబు పూర్తి ఆరోగ్యంతో కరోనా నుండి బయటపడ్డారు. వెంటనే ఆయన బ్లడ్ బ్యాంక్ కు వెళ్లి ప్లాస్మా దానం చేసారు. ఆయన ప్లాస్మా దానం చేటప్పుడు తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.
నాగబాబు చేసిన ఈ పనికి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘కరోనాతో పోరాడి గెలవడమే కాకుండా ఇతరులను కాపాడేందుకు ముందుకొచ్చిన నీకు అభినందనలు. అంతేకాకుండా కరోనా నుంచి కోలుకున్న వారు అంతా ప్లాస్మా దానం చెయ్యడానికి ముందుకు రావాలి’ అని చిరు ట్విట్ చేసారు. ఈ ట్విట్ ఇప్పుడు ట్విట్టర్ ప్రపంచంలో తెగ వైరల్ అవుతుంది. చిరుతో పాటుగా మెగాస్టార్, పవర్ స్టార్ అభిమానులు కూడా మెగా బ్రదర్ నాగబాబు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. అభిమానులందరం కూడా నాగబాబు దారిలోనే నడిచి ప్లాస్మా దానం చేస్తామని తెలిపారు. మేము ఇవ్వడంతో పాటుగా కరోనా నుండి కోలుకొని ఆరోగ్యంగా ఉన్నవారిని కూడా ప్లాస్మా దానం చేయడానికి ఒప్పిస్తామని తెలిపారు. అన్నయ్య చేసిన ట్విట్ కు నాగబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
covid 19 తో పోరాడి గెలవటమే కాదు, ఇంకా కొందరిని కాపాడే ప్రయత్నంలో, CCTలో plasma donate చేసిన తమ్ముడు @NagaBabuOffl కి అభినందనలు👌👍ఈ సందర్భంగా covid నుంచి కోలుకున్నవారికి మరో మారు నా విన్నపం. మీరు plasma donate చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు.దయచేసి ముందుకు రండి.🙏 #DonatePlasma pic.twitter.com/L8nUPJPinc
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 15, 2020











