బైక్ ప్రమాదానికి గురై కోలుకుంటున్న హీరో సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ సినిమా విడుదల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదేలేదంటున్నాడు. మొదట్లో ఈ సినిమాని అక్టోబరు 1కే విడుదల చేయాలనుకున్నారు. అయితే సాయిధరమ్ రోడ్డు ప్రమాదానికి గురవడంతో దర్శకనిర్మాతలు సినిమా విడుదలను వాయిదా వేయాలనుకున్నారు. ఈ విషయాన్ని సాయిధరమ్ కు చెబితే అలా వద్దు.. ముందు అనుకున్న సమయానికే విడుదల చేయండి అన్నారట. అందుకే అక్టోబరు 1న ఈ సినిమాని విడుదల చేయాలని అనుకున్నారు.
అలాగే ఈరోజు ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. దేవా కట్టా దర్శకత్వంలో జేబీ ఎంటరటైన్మెంట్స్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ విశాఖ వాణిగా రమ్యకృష్ణ నటించారు. జగపతి బాబు ఓ కీలక పాత్ర పోషించారు. ట్రైలర్ ను విడుదల చేసిన తర్వాత చిరు ట్వీట్ చేస్తూ ‘సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది.
మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష’ అని పేర్కొన్నారు. టైలర్ చూస్తే ఈ సినిమాలో మంచి పవర్ ఫుల్ డైలాగులు కూడా ఉన్నాయి. ‘యాజ్ పర్ కాన్ స్టిట్యూషన్ చట్టసభల ఆదేశాల మేరకే ఉద్యోగస్తులు పనిచేయాలనే విషయం మరచిపోయినట్టున్నావ్’ అని రమ్యకృష్ణ అంటే ‘యాజ్ పర్ కాన్ స్టిట్యూషన్ చట్టసభల ఆదేశం మారణ హోమానికి దారితీస్తే ఉద్యోగస్తులు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.
ఫాలో అయితే మీలాంటోళ్లు హిట్లర్లవుతారు’ అని హీరో సాయిధరమ్ కౌంటర్ ఇస్తాడు. ప్రజల్ని చైతన్యవంతం చేసేలా సాయిధరమ్ తేజ్ పాత్రను రూపొందించారు. మొత్తానికి ట్రైలర్ చూస్తే రమ్యకృష్ణను ఎదుర్కోనే పాత్రను సాయిధరమ్ పోషించినట్టు అర్థమవుతోంది. నరసింహ, బాహుబలి తర్వాత మరో పవర్ ఫుల్ పాత్రను రమ్యకృష్ణ పోషించినట్టు స్పష్టమవుతోంది.
Must Read ;- చిరంజీవి, అమీర్ ఖాన్ సమక్షంలో ‘లవ్ స్టోరి’ ఈవెంట్











