సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సినిమా రంగ ప్రముఖులు కూడా స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మంచు మనోజ్ సైదాబాద్ వెళ్లి బాలిక తల్లిని పరామర్శించి వచ్చారు. ఈరోజు రాజు ఆత్మహత్య అనంతరం మెగాస్టార్ చిరంజీవి, మంచు మనోజ్ లు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ఆభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కిరాతకుడు రాజు తనకు తానే శిక్షించుకోవడం బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత ఊరట కలిగిస్తోంది.
ఈ సంఘటనపై మీడియా, పౌర సమాజం చాలా గొప్పగా స్పందించాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతోపాటు పౌర సమాజం కూడా చొరవ చూపాలి. అలాంటి కార్యక్రమాన్ని ఎవరు చేపట్టినా వారికి నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి’ అని మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
మొన్న మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు నటుడు మంచు మనోజ్ కూడా రిప్లయ్ ఇచ్చారు. ‘సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.. దేవుడున్నాడు’ అని జవాబిచ్చారు. రాజు మరణంపై నెటిజన్లు కూడా విపరీతంగా స్పందించారు. కాకపోతే ఇంత తేలికగా అతను చనిపోవడాన్ని కూడా కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసుల చేతికి చిక్కి వారి చేతుల్లో హతమై ఉంటే బాగుండేదన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది.
Must Read ;- సైదాబాద్ మృగాడు ఆత్మహత్య











