మెగా ఫ్యామిలీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా ఫ్యామిలీకి చెందిన కజిన్స్ అంతా కలిసి క్రిస్మస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తమ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోను అల్లు వారబ్బాయ్ శిరీష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఈ వేడుకలను హోస్ట్ చేశారు. ఈ వేడుకలో నూతన జంట చైతన్య, నిహారిక సందడి చేశారు. ఇందులో రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరిష్, వైష్ణవ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి క్రిస్మస్ సందర్భంగా ట్విట్టర్ లో స్పందిస్తూ.. మన జీవితాల్లో ఆనందాన్ని తీసుకువస్తుందని తెలియచేస్తూ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియచేసారు. ఇదిలా ఉంటే.. ఈరోజు మెగా సాయిధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటరు సినిమా రిలీజైంది. థియేటర్లు మూతపడిన తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ ఇదే. ఈ సినిమా సక్సస్ అవ్వాలని ఇండస్ట్రీ అంతా కోరుకుంటుంది. సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తుండడం తెలిసిందే. ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఆశించిన స్ధాయిలో కలెక్షన్స్ వస్తే.. మరిన్ని సినిమాలు థియేటర్లో రావడం ఖాయం.
Must Read ;- బన్నీ గురించి వనితా విజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..!
Merry Christmas from all of us! Played Secret Santa with cousins like every year. Thank you Charan & Upsi for being such amazing hosts. 🌲🎅🎄🎁 pic.twitter.com/6AqoUDbB20
— Allu Sirish (@AlluSirish) December 25, 2020