‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’.వెబ్ సిరీస్ తో నిర్మాతగా కూడా తన సోదరి పరిచయమవుతుండటం ఆనందదాయకమని ప్రముఖ హీరో రామ్ చరణ్ అన్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నందిని రాయ్ ప్రధాన పాత్రధారులుగా ఆనంద్ రంగా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ ఈ వెబ్ సిరీస్ నిర్మించారు ‘జీ 5’ ఓటీటీ వేదికలో డిసెంబర్ 25న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ ప్రసారం కానున్న ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.
Must Read ;- ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత చరణ్ చేయనున్న సినిమా ఇదే..!
ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రామ్ చరణ్ ఈ సిరీస్ షోరీల్ విడుదల చేశారు. అనంతరం రామ్ చరణ్ మాట్లాడుతూ, “.నాన్నగారు చిత్ర పరిశ్రమలో ప్రయాణం మొదలు పెట్టినప్పట్నుంచి మా కుటుంబం చాలా ప్రయోగాలు చేసింది. మేము అందరం చాలా కష్టపడుతున్నామని గర్వంగా చెప్పగలను. సుష్మిత ఫైటర్ కోవలో ఓటీటీలోకి ప్రవేశించింది. నేను నటించిన ‘రంగస్థలం’ చిత్రానికి అక్క స్టయిలిస్ట్ గా వర్క్ చేసింది. నేను తొలిసారి నిర్మాతగా తీసిన ‘ఖైదీ నంబర్ 150’కి కూడా అక్క వర్క్ చేసింది. బయటవాళ్లను తిట్టగలం. కానీ ఇంట్లోవాళ్లను తిట్టలేం. ఏదైనా పనుల్లో తేడా వస్తే నాన్నగారు నన్ను తిట్టేవారు. నేను ఎవరి మీదైనా కోపం చూపించాలన్నా అక్కపై చూపించేవాడిని. నాకు పెద్ద సపోర్ట్ అక్కే.
ఈ సిరీస్ ను చక్కటి టీమ్ తో తీసినట్లు అర్ధమవుతోంది. అక్క సుస్మిత నిర్మాతగా కూడా మరిన్ని మంచి ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నాను. మనందరికీ ఈ సంవత్సరం చాలా కష్టంగా గడిచింది. దీనిని ఎప్పటికీ మరచిపోలేం. దీనివల్ల ఎంతో నేర్చుకున్నాం కూడా. చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే మళ్లీ తన కాళ్ల మీద నిలబడగలిగింది. దర్శకుడు ఆనంద్ రంగా లోగడ తీసిన “ఓయ్” చిత్రం పాటలను ఎప్పుడూ వింటుండేవాడిని. ఈ సిరీస్ ను ఆయనెంతో బాగా మలిచారు. సహజత్వానికి చాలా దగ్గరగా వుంది. నటీనటులు లుక్ విషయం మొదలుకుని నటన వరకు చాలా మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు” అని అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన సుస్మిత మాట్లాడుతూ, ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్న సమయంలో ఈ సిరీస్ స్క్రిప్ట్ తమ వద్దకు వచ్చిందని అన్నారు. దీని ప్రసారానికి అద్భుతమైన ‘జీ 5’. వేదిక దొరకడం సంతోషంగా వుంది. ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ఇందులో నటించడం ఓ ఆకర్షణ. నా అభిరుచికి కుటుంబ సభ్యులంతా వెన్నుదన్నుగా నిలవడం వల్లే ఓ మంచి ప్రాజెక్ట్ ర్మించగలిగాం;; అని చెప్పారు.
మరో అతిథిగా పాల్గొన్న బి.వి.నందినీరెడ్డి కూడా టీమ్ తో పాటు సుస్మితను అభినందిస్తూ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు ఆనంద్ రంగా, నటీనటులు తేజ, నందినీరాయ్, జీ 5 సంస్థకు చెందిన ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ అనిల్ బండారి, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి, సంగీత దర్శకుడు నరేష్ కుమారన్, ఎడిటర్ నారాయణ, ఇంకా ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
Also Read ;- బిగ్ బాస్ సీజన్ 5 కి హోస్ట్ మెగాస్టారా.?