మెగా డాటర్ ఇన్- లా, రామ్ చరణ్ సటీమణి ఉపాసన కొణిదెల యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. పోషకాహారంపై అద్భుతరీతిలో అవగాహన కల్పిస్తోన్న ఈ పోర్టల్ కి అక్కినేని వారి కోడలు సమంతా అక్కినేని గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరించింది. ఇందులో భాగంగా సమంత ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కన్నడ బ్యూటీ రష్మికా మందణ్ణ కూడా గెస్ట్ ఎడిటర్ గా కనిపించబోతోంది. తనకు తెలిసిన ఆరోగ్య సూత్రాల్ని, పోషాకాహారం యొక్క ప్రాముఖ్యతను రష్మికా పంచుకోనుంది.
రష్మికా ఇందులో హెల్త్ టిప్స్ కూడా తెలుపనుంది. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఆరోగ్య సంరక్షణ కోసం ఈ పోర్టల్ ను క్రియేట్ చేశారు. యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ ద్వారా పోషకాహారం, ఆరోగ్యానికి సంబంధించిన వర్కవుట్స్ .. లాంటి వెల్ నెస్ క్యాంపైన్ మొదలు పెడుతున్నారు. రష్మికాను గెస్ట్ ఎడిటర్ గా నియమించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆమె ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోస్ లో రష్మికా ఎల్లో కలర్ డ్రెస్ లో చేతిలో ఆరెంజ్ తో ఈ ఫోటోస్ లో రివీలైంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.