మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు, వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తున్న సినిమా ఉప్పెన. ఈ చిత్రం ద్వారా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా పాటలు యూట్యూబ్ ని షేక్ చేయడంతో ఈ మూవీ పై మరింత ఆసక్తి ఏర్పడింది. సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కావాలి కానీ.. కరోనా కారణంగా ఆగింది. అయితే.. రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రయత్నించాయి. అయితే.. కొంత మంది నిర్మాతలు మాత్రం డైరెక్ట్ గా థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పారు.
నాని వి, అనుష్క నిశ్శబ్ధం, రాజ్ తరుణ్ ఓరేయ్ బుజ్జిగా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఉప్పెన సినిమాని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి కానీ.. ఎప్పుడు అనేది మాత్రం ఎనౌన్స్ చేయలేదు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఉప్పెన సినిమాకి సంబంధించి ఇప్పటికే ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కు అమ్మేయడం జరిగిందట. భారీ మొత్తానికి నెట్ ఫ్లిక్స్ వారు ఉప్పెన ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేసినప్పటికీ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుందట. ఈ విధంగా ఈ సినిమా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలిసింది.
దీంతో ఉప్పెన సినిమా ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ లేదని క్లారిటీ వచ్చేసింది. అయితే.. వైష్ణవ్ తేజ్ రెండో సినిమాను క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కొండపొలం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
Must Read ‘= కృతిశెట్టి గ్లామర్ ఉప్పెన కాదు సునామీ!