అక్కినేని అఖిల్ 5 వ చిత్రంగా .. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న స్పై అడ్వంచరస్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. మొన్నామధ్య టైటిల్ లోగో తో పాటు అనౌన్స్ మెంట్ జరుపుకున్న ఈ సినిమాని హాలీవుడ్ సూపర్ హిట్ బోర్న్ సిరీస్ తరహాలో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సూరి ఆస్థాన రచయిత వక్కంతం వంశీ దీనికి కథ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అఖిల్ ను నెవర్ బిఫోర్ అవతార్ లో ఎలివేట్ చేయబోతున్నాడు సురేంద్రరెడ్డి. ఇందులోని అఖిల్ లుక్ కు అభిమానుల నుంచి మంచి అప్లాజ్ వచ్చింది.
నిజానికి ‘ఏజెంట్’ సినిమా అనౌన్స్ మెంట్ నాటికి స్ర్కిప్ట్ లాక్ చేసుకున్న సురేంద్రరెడ్డికి.. అందులో లూప్ హోల్స్ ఉన్నట్టు అనిపించిందట. అంతేకాదు.. వాటిని తన రైటర్స్ టీమ్ తో రీరైట్ చేయిస్తున్నాడట.
ఇప్పటికే కథను అఖిల్ ఓకే చేశాడు. సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. ఈ టైమ్ లో సూరి కథలో కసరత్తులు ఎందుకు చేస్తున్నాడో ఎవరికీ అంతబట్టడం లేదు. ఒక వేళ ఇదే కథతో ఆల్రెడీ ఏభాషలోనైనా ఏదైనా సినిమా వచ్చిందా? అనే సందేహం కలుగుతోంది. ఈ కథ ను మార్చడానికి టైమ్ బాగానే పట్టేలా ఉంది. మరి సినిమా సెట్స్ మీదకు ఎప్పటికి వెళుతుందో చూడాలి.