భారత్‌లో సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తున్ననేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది.భారత్‌లో నమోదవుతున్న కొత్త వేరియంట్ కేసులను ఇండియన్ వెరియంట్‌గా గుర్తించడం లేదని,గతంలో పలు దేశాల్లో అలాంటి వేరియంట్ కేసులు నమోదయ్యాయని తెలిపింది.దీంతోపాటు భారత్ ఎన్నికలు, కొన్ని సమ్మేళనాలు,ఉత్సవాల్లాంటివి ఈ కేసులు పెరిగేందుకు కారణంగా భావిస్తున్నట్లు పరోక్షంగా పేర్కొంది.ఈ మేరకు WHO దక్షిణాసియా వ్యవహారాల విభాగం ట్వీట్ చేసింది.ఇందుకు సంబంధించి 32పేజీల నివేదిక వెలువరించింది.అదే సమయంలో భారత్‌లో వైరస్ ఉధృతి పెరగడానికి కొత్త వేరియంట్ కారణమని తెలిపింది.
ఎక్కువ కేసులు అవే..
భారత్‌లో నమోదవుతున్న B 1.617, B 1.617.2 రకాలే కేసుల పెరుగుదలకు కారణమని వెల్లడించింది.ప్రమాదకర బీ.1.617 రకాన్ని దేశంలో తొలిసారిగా గతేడాది అక్టోబర్‌లోనే గుర్తించారని గుర్తు చేసింది.అందులో ఉప రకాలు కూడా ఆ తర్వాత ఒక్కొక్కటిగా వెలుగుచూశాయని వ్యాఖ్యానించింది.ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 21 శాతం బీ.1.617.1 వల్ల,ఏడు శాతం బీ.1.617.2 వల్ల నమోదైనవేనని వెల్లడించింది
దేశాల పేర్లతో వైరస్‌కు పేరుపై స్పష్టత..
కాగా ప్రస్తుతం కొవిడ్‌కు సంబంధించి ప్రపంచంలో పలు దేశాల పేర్లతో కొత్త వేరియంట్లను పిలుస్తున్నారు.బ్రిటన్ వేరియింట్, ఇండియన్ వేరియంట్ పేర్లతో పిలుస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ ఓ స్పష్టత ఇచ్చింది.వైరస్‌లు తొలుత కనిపించిన దేశాల పేర్లతో తాము గుర్తించం లేదని,శాస్త్రీయ పేర్లతోనే పిలుస్తున్నామని వ్యాఖ్యానించింది.ప్రపంచవ్యాప్తంగా ఆ వేరియంట్లను గుర్తించేందుకు అందరూ ఇదే పద్ధతిని అనురించాలని సూచించింది.కాగా ఇండియన్ కొవిడ్-19పేరుతో 44దేశాల్లో కొత్త వేరియంట్ కనిపించిందన్న వార్తల నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.భారత ప్రభుత్వం కూడా గతంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
B.1.617 ప్రమాదకరం..
డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన నివేదికలో B.1.617 వేరియంట్ ప్రమాదకారిగా పేర్కొంది.ఇప్పటికే బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలలో వేరియంట్లను గుర్తించామని,భారత్‌లో కనిపించిన వైరస్ నాలుగో వేరియంట్ అని, కొవిడ్ మొదటి వేరియంట్ కంటే ఇది ప్రమాదకరంగా ఎక్కువ మందికి వ్యాప్తి చెండంతోపాటు వేగంగా విస్తరిస్తోందని వెల్లడించింది. అందుకే తాము ప్రత్యేక వేరియంట్ జాబితాలో చేర్చామని వ్యాఖ్యానించింది.ఈ వైరస్ వేరియంట్‌ను 2020 అక్టోబరు5న గుర్తించామని వెల్లడించింది.తరువాత భారత్ దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. ఓవైపు ఎన్నికలు,బహిరంగ ప్రదేశాల్ల జనసందోహం ఎక్కువ కావడం,ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా కొవిడ్ కేసులు పెరిగేందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ ఓ నివేదికపై చర్చ నడుస్తోంది.
ఈ అంశంపై డబ్ల్యూహెచ్‌ఓ కోవిడ్ విభాగ సాంకేతిక నిపుణురాలు డా. మరియా వాన్ కేర్‌కోవ్ ఇటీవల మాట్లాడుతూ B.1.6.17 స్ట్రెయిన్ ప్రమాకరంగా మారిందని వ్యాఖ్యానించారు.ఈ వైరస్ వ్యాప్తి తీవ్రతపై పరిశీలిస్తున్నామని, పరిశోధనలూ జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్‌ను వర్గీకరించాల్సి ఉందని,అప్పటి వరకూ దీనిని వేరియంట్ ఆఫ్ ఇంటరస్ట్ గానే పేర్కొంటామని అన్నారు.











