సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఈ రోజు తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న తిరుపతి చేరుకున్నఆయన తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అలిపిరి మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు. ఈ రోజు వీఐపీ విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ జవహర్‌రెడ్డి,అదనపు ఈవో ధర్మారెడ్డి , పోలీసు అధికారులు ఆయన వెంట ఉన్నారు.