కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 500కు పైగా సినిమాల్లో నటించి.. ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి.. ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్ధానం సంపాదించుకున్నారు. ఆయన నట వారసులుగా మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీప్రసన్న సినిమాల్లో నటిస్తుండడం.. రాణిస్తుండడం తెలిసిందే. ఇప్పటికీ మోహన్ బాబు తనదైన స్టైల్ లో నటిస్తూ మెప్పిస్తున్నారు. తాజాగా సన్నాఫ్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. త్వరలో ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మంచు వారి వారసులుగా, టాలీవుడ్ హీరోలుగా తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ సోదరుల పర్సనల్ వ్యవహారాల పై గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు వచ్చాయని.. ఇద్దరికీ అసలు పడడం లేదని గతంలో వార్తలు వచ్చాయి. అయితే.. ఇదే విషయం గురించి ఆలీతో సరదాగా అనే టీవీ షోలో పాల్గొన్న మంచు విష్ణుని ఆలీ అడగడం జరిగింది. దీనికి మంచు విష్ణు సీరియస్ రియాక్షన్ ఇచ్చారు.
దీనికి సంబంధించిన రిలీజ్ చేసిన ప్రొమోలో నీకు, మనోజ్‌కి పడటం లేదట. మనోజ్ పై చాలా కోపంగా ఉంటున్నావంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అందులో నిజమెంత? వాటి గురించి నువ్వే చెప్పాలి అని విష్ణుని అడిగారు ఆలీ. దీనికి మంచు విష్ణు.. వేసుకున్న కోటు విప్పేస్తూ సీరియస్ అయ్యాడు. అంతే కాకుండా.. పర్సనల్ విషయాలు వాళ్లకెందుకు? ఎందుకు చెప్పాలి వాళ్లకు సమాధానం అంటూ కోపంగా సీటులోంచి లేచి నిలబడ్డాడు. ఈ ప్రొమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ.. ఏం జరిగింది.? నిజంగానే విష్ణు, మనోజ్ మధ్య గొడవలు జరిగాయా..? లేదా..? దీనికి విష్ణు ఏం చెప్పారో తెలియాలంటే ఈ ఇంటర్ వ్యూ టెలికాస్ట్ అయ్యే వరకు ఆగాల్సిందే.











