మెగా ఫ్యామిలీకి సంబంధించిన నాలుగు తరాల ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటా పోటో అంటే.. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా చిరు కుటుంబంలోని నాలుగు తరాలకు చెందిన ఆడవాళ్లు లక్ష్మీదేవికి పూజ చేశారు. ఈ పోటోలో చిరంజీవి తల్లి అంజనాదేవి, భార్య సురేఖ తో పాటు.. కోడలు ఉపాసన.. శ్రీజ కూతురు నివృతి ఉన్నారు. చిరంజీవి ఇంట్లో ఏ పండగనైనా అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ఇక మహిళలు అత్యంత ప్రాముఖ్యత ఉన్న వరలక్ష్మి అమ్మవారిని మెగాఫ్యామిలీలోని ఆడవాళ్లు కూడా అత్యంత భక్తి శ్రద్దలతో పూజించారు. వ్రతం నోచుకున్నారు.
ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. మెగా ప్యామిలీ మెంబర్స్ కి మాత్రమే కాకుండా.. ఆయన అభిమానులు అందరికీ పండగ రోజు. ఈ పండగ వారం ముందు నుంచి మొదలైంది. దీనికి తోడు శ్రావాణ శుక్రవారం కూడా రావడంతో ఆ ప్యామిలీలో నాలుగైదు రోజుల నుంచి పండగ వాతావరణం నెలకొంది. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఆచార్య సినిమా ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. రీసెంట్ గా లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు.
మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. అలాగే బాబీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా నాలుగు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను అందించడం బహుశా ఆయన కెరీర్లోనే ఇదే తొలిసారి కావచ్చు.