గంగాధర నెల్లూరులో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన కార్యకర్తల మీటింగ్‌కి అనూహ్య స్పందన లభించింది.. ఈ భేటీకి భారీ సంఖ్యలో నియోజకవర్గ కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు.. సాధారణంగా ఇలాంటి కార్యకర్తల మీటింగ్‌లు ఎన్నికల ముందు మాత్రమే కనిపిస్తాయి.. అధికారంలోకి రాగానే సహజంగానే నేతలు మరిచిపోతుంటారు.. కొందరు అవసరం తీరిందని పట్టించుకోరు.. కానీ, చంద్రబాబు నాయుడు తాను మారానని, ఇకపై పొలిటికల్ గవర్నెన్స్ చేస్తానని పదే పదే చెప్పడమే కాదు, ఆచరణలోకి తీసుకు వస్తున్నారు.. కార్యకర్తలతో నియోజకవర్గ స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉండి హాజరు కావడం బహుశా అరుదు.. దానిని అమలు చేసి చంద్రబాబు తానేంటో ప్రూవ్ చేశాడు..
నెల్లూరు గంగాధర మీటింగ్‌లో చంద్రబాబు స్థానిక ఎమ్‌ఎల్‌ఏ వీడీ థామస్ కార్యకర్తలతో ఎలా నడుచుకుంటున్నారు..? ఆయన తన దగ్గరికి వచ్చిన సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నారు..?? సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారా..? లేదా.? ఉంటే ఎన్ని పోస్టులు పెట్టారు..? వాటికి వచ్చిన రెస్పాన్స్‌ని కూడా ఆయన తన ప్రసంగంలో ఉటంకించారు.. నేతలు భజనపరులని దగ్గర చేసుకోకూడదని, పని చేసే కార్యకర్తలని అక్కున చేర్చుకోవాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు..
కార్యకర్తలతో చంద్రబాబు మీటింగ్ సూపర్ సక్సెస్ అయింది.. ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా తమకు కొంత సమయం కేటాయించడంతో నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లలో జోష్ నెలకొంది.. తమని పేరు పేరునా పిలవడం, వారిని పలుకరించడంతో కేడర్‌లో ఉత్సాహం పరవళ్లు తొక్కుతోందని స్థానిక నేతలు చెబుతున్నారు.. ఇదే ఇప్పుడు వైసీపీలో చిచ్చు పెడుతోంది.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా తమను పట్టించుకోవడం లేదని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు వాపోతున్నారు.. చంద్రబాబు తెలుగు తమ్ముళ్లను ఆదరిస్తున్న తీరుని చూసి జగన్‌పై మండిపడుతున్నారు..జగన్ అధికారంలోకి వచ్చి 2.O చూపాల్సిన పనిలేదని, తమ సమస్యలు వింటే చాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
తాను అధికారంలోకి వస్తే జగన్ 2.O చూపిస్తానని.. కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని.. మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను కొంత తడబడ్డానని, ప్రభుత్వం, పథకాలపైనే ఫోకస్ పెట్టానని చెబుతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కార్యకర్తల కష్టంతో అయిదేళ్లు పల్లకిలో ఊరేగిన జగన్… పవర్‌లోకి వచ్చిన తర్వాత వారిని విస్మరించాడు.. తాడేపల్లి ప్యాలెస దాటి ఎప్పుడయినా ప్రజల మధ్యకు పరదాల చాటున వచ్చినా, అలా వచ్చి ఇలా తుర్రున పారిపోయేవాడు.. ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వారిని ఓటు బ్యాంక్‌గా మాత్రమే గుర్తించాడు.. ఇదే జగన్‌కి, చంద్రబాబుకి ఉన్న తేడా అని.. ఇప్పటికి అయినా టీడీపీ అధినేతని చూసి నేర్చుకోవాలని, లేదంటే తమ పవర్ చూపించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు కొందరు కార్యకర్తలు..
మొత్తమ్మీద, చంద్రబాబు చేసిన రాజకీయ ప్రయోగానికి వైసీపీ నేతల నుండి ప్రశంసలు అందుకుంటోంది. ఇది, ఫ్యాన్ పార్టీలో ఎలాంటి చిచ్చు రేపుతుందో చూడాలి..











