ఏపీలో వైసీపీ సోషల్ మీడియా నోటికి తాళం పడింది.. ఆ పార్టీ ఎస్‌ఎమ్ కార్యకర్తలు, అభిమానులు గత రెండు మూడు నెలలుగా ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.. ఏపీలో అభివృద్ది జరగడం లేదని, జీఎస్‌టీ ఆదాయం పడిపోతోందని పలువురు బులుగు యూట్యూబర్‌లు, పాడ్ కాస్టర్‌లు పదే పదే ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతున్నారు.. వారికి తాజాగా అంకెలతో సహా జీఎస్‌టీ అధికారులు ఇచ్చేశారు..
ఫిబ్రవరిలో ఏపీలో జీఎస్‌టీ రెవెన్యూ 5 శాతం పెరిగింది.. ఇదే తెలంగాణలో కేవలం 1 శాతం మాత్రమే పెరగడం విశేషం.. గతేడాది ఇదే నెలతో పోల్చుకుంటే 5 శాతం వృద్ధి నమోదు చేసింది ఏపీ. జీఎస్‌టీ కింద ఫిబ్రవరిలో తెలంగాణకు రూ. 5,280 కోట్లు దక్కగా, ఏపీకి రూ. 3,817 కోట్ల రూపాయలు లభించాయి.. ఇక దేశంలోనే అత్యధిక జీఎస్‌టీ పొందిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు ముందు వరసలో ఉన్నాయి.. ఆ తరవాత యూపీ, ఢిల్లీ ఉన్నాయి.. అయితే, ఈ జాబితాలో ఏపీ కాస్త వెనుకబడినా జీఎస్‌టీ ఆదాయం పరంగా పురోభివృద్ధి సాధిస్తోందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
2014 నుండి 19 వరకు సాగిన చంద్రబాబు సర్కార్ హయాంలో తెలంగాణకు సరిసాటిగా ఏపీ జీఎస్‌టీ ఆదాయం ఉండేది.. 2019 – 24 మధ్య కాలంలో ఇది బాగా డ్రాప్ అయింది.. జగన్ సర్కార్ ప్రయివేటు కంపెనీల మీద, ఉద్యోగాల అవకాశాల మీద, రాష్ట్ర అభివృద్ది మీద ఫోకస్ పెట్టలేదు.. ఏపీలో పెట్టుబడి పెట్టడానికి క్యూ కట్టిన అనేక కంపెనీలు రాష్ట్రం నుండి వెనక్కి వెళ్లిపోయాయి.. కొన్నింటిని వైసీపీ నేతలు తరిమేశారు.. ఇదే ఏపీ వెనుకబాటుకు ప్రధాన కారణం అయ్యాయి.. ఈ ప్రభావంతో ఏపీలో జీఎస్‌టీ ఆదాయం డౌన్ అయింది..
ఈ నిజాలని అంగీకరించడానికి ముందుకు రాని పేటీఎమ్ బ్యాచ్…. కూటమి సర్కార్‌పై విషం కక్కుతోంది.. గత రెండు మూడు నెలలు వాస్తవానికి జీఎస్‌టీ ఆదాయం పడిపోయినా, తాజాగా పుంజుకుంటోంది.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆయన తీసుకుంటున్న చర్యలు ఏపీ ఆర్ధిక వ్యవస్థకు జవసత్వాలు అందిస్తోందని ఎకనామిస్టులు అభిప్రాయ పడుతున్నారు..
ఇక అమరావతి నిర్మాణం, పోలవరంతోపాటు నిర్మాణ రంగం పట్టాలెక్కి, ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడితే, జీఎస్‌టీ వసూళ్లలో ఏపీ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.. ఇదే తాజాగా జీఎస్‌టీ వసూళ్లలోనే ప్రతిబింబించిందని చెబుతున్నారు.. మరి, వీటిపై బులుగు బ్యాచ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..











