వైసీపీ ప్రభుత్వంలో ఎంతటి అరాచకాలు, అక్రమాలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా.. ఇలా అనేక స్కాములలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు.. జగన్ టీమ్ దోపిడీ ప్రభుత్వానికే పరిమితం కాలేదు. పార్టీలోనూ ఆ నేతల అరాచకాలు కొనసాగాయి.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహిత మిత్రుడు, ఓ ప్రముఖ వ్యాపారవేత్తని పార్టీలోని ముగ్గురు నేతలు కలిసి ఏకంగా 20 కోట్లకు ముంచారని వైసీపీ అనధికారిక వెబ్ సైట్‌లో కథనం రావడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది..
ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే.. 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన ఓ ప్రముఖ అభ్యర్థి.. జగన్‌కి అత్యంత సన్నిహిత మిత్రుడుని ఆశ్రయించాడు.. ‘ఎన్నికల ఖర్చుల కోసం మీ నుంచి రూ. 20 కోట్లు తీసుకోవాలని జగన్ అడిగారని, ఎన్నికలు ముగిసిన వెంటనే తిరిగి ఇస్తానని’ ఆ ఎంపీ అభ్యర్థి అతనితో చెప్పాడు. ఎక్కడో వ్యవహారం తేడాగా ఉందని భావించిన జగన్ మిత్రుడు దీనిపై సందేహం వ్యక్తం చేశాడు..
జగన్ ఫ్రెండ్ ప్లస్ ఆ బిజినెస్ మేన్‌ని నమ్మించడానికి ఏకంగా ఒక టీమ్ రంగంలోకి దిగింది.. ఆ ఎంపీ అభ్యర్ధికి కావలసిన 20 కోట్ల కోసం నాటి ముఖ్యమంత్రి జగన్ రోజువారీ వ్యవహారాలను నిర్వహించే పెద్దాయన.. ఆ బిజినెస్ మేన్‌కి ఫోన్ చేసి నిధులు సమకూర్చాలని కోరారు.. అప్పటికీ అతనికి అనుమానాలు తీరకపోవడంతో మూడవ వ్యక్తి రంగంలోకి దిగాడు.. ఈసారి జగన్ అపాయింట్‌మెంట్‌లని చూసే వ్యక్తి .. ఆ వ్యాపారవేత్తకి ఫోన్ చేసి 20 కోట్లు అడ్జస్ట్ చేయాలని కోరాడు.. ఇలా ఆ వ్యాపారి, వైసీపీ ఎంపీ అభ్యర్థికి ₹20 కోట్లు ఇచ్చాడు. అయితే, ఎన్నికలు జరిగాయి, ఆ అభ్యర్థి ఓడిపోయారు. ఇప్పటి వరకు డబ్బులు తిరిగి ఇవ్వలేదు.
ఆ బిజినెస్‌మేన్‌కి కొత్త అనుమానాలు మొదలయ్యాయి.. మరి, జగన్ నిజంగానే ఆ 20 కోట్లు ఇవ్వాలని సూచించారా.? లేక, ఆ వ్యాపారవేత్త దగ్గర 20 కోట్ల కోసం ఈ ముగ్గురు కలిసి స్కామ్‌కి పాల్పడ్డారా.? అనేది క్లారిటీ లేదు.. మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ బిజినెస్ మేన్, జగన్‌కి అత్యంత సన్నిహితుడు అయినప్పటికీ ఆ ముగ్గురూ ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు.. దీంతో, ఆయన కుర్రో మొర్రో అంటున్నారు.. మరి, ఆ బిజినెస్ మేన్‌కి న్యాయం జరుగుతుందా..? లేదా..?











