ఓటీటీకీ సినిమాకీ పోలికే లేదని ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం నిరూపించింది. 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా కలెక్షన్ల పరంగా కుమ్మేస్తోంది. మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించారు. భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. కరోనా వలన థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. కరోనా తర్వత రిలీజైన ఫస్ట్ మూవీ కావడంతో ఈ సినిమాకి ఎలాంటి స్పందన లభిస్తుందో అని సినీ ప్రియులు, సినీ ప్రముఖులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.
అయితే.. మార్నింగ్ షో నుంచే అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ రావడం విశేషం. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన రావడంతో జనాలు థియేటర్ కి వచ్చి సినిమా చూడడానికి రెడీగా ఉన్నారని తెలిసింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని సినిమాలు థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. సంక్రాంతికి కొత్త సినిమాలు వస్తాయో రావో అనుకున్నారు కానీ.. ఈ సినిమాకి ఆదరణ లభిస్తుండడంతో సంక్రాంతికి సినిమాలను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు పోటీపడుతున్నారు.
ఇక ఈ సినిమా రెండో రోజులు కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాం – 1.19 కోట్లు, సీడెడ్ – 0.59 లక్షలు, గుంటూరు – 0.26 లక్షలు, నెల్లూరు – 0.13 లక్షలు, కృష్ణా – 0.18 లక్షలు, వెస్ట్ – 0.15 లక్షలు, ఈస్ట్ – 0.24 లక్షలు, వైజాగ్ – 0.55 లక్షలు వసూలు చేసింది. రెండో రోజు గ్రాస్ – 3.29 కోట్లు, మొత్తం రెండు రోజుల గ్రాస్ – 7.99 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ బాగా పెరిగాయి. రానున్న రోజుల్లో మరింతగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.