తమిళ హాస్య నటుడు పాండు కరోనాతో కన్నుమూశారు. పాండు వయసు 74 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా కరోనా కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ఫలితం దక్కలేదు. ఈరోజు పరిస్థితి విషమించి మరణించారు. పాండు సినిమా రంగంలో చాలా కాలంగా ఉన్నారు.
అతను మంచి డిజైనర్ కూడా. తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకులును అతనే డిజైన్ చేశాడు. తమిళనాడు టూరిజం లోగోను కూడా ఆయనే రూపొందించారు. మంచి టైమింగ్ ఉన్న కమెడియన్ గా పాండుకు గుర్తింపు ఉంది. పాండు మృతిపట్ల తమిళనాడు చిత్ర పరిశ్రమ సంతాపం ప్రకటించింది.











