నటి విద్యులేఖ రామన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. గత కొంతకాలంగా ఆమె సంజయ్ ప్రేమలో ఉన్నారు. న్యూట్రిషన్ నిపుణుడైన సంజయ్ తో ఆమె గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారు. లావుగా ఉన్న ఆమె లాక్ డౌన్ సమయాన్ని సద్వినయోగపరుచుకొని సన్నగా మారిన సంగతి తెలిసిందే.
విద్యులేఖ సన్నగా మారడంలో సంజయ్ పాత్ర ఎక్కువగా ఉందనే వార్తలు వస్తున్నాయి. కామెడీ చిత్రాలతో తమిళ, తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచయస్థులే. సరైనోడు, తొలి ప్రేమ, రాజు గారి గది, భాగమతి లాంటి సినిమాలలో ఆమె తన టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించారు. సరైనోడు సినిమాలో ఆమె చెప్పిన సాంబారంటే ఇష్టమనే డైలాగ్ అందరికి గుర్తుండే ఉంటుంది.
ఆమె తండ్రి ప్రముఖ కమెడియన్ మోహన్ రామన్ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. కరోనా వైరస్ కారణంగా అతి ముఖ్యుల సమక్షంలో విద్యులేఖ-సంజయ్ నిశ్చితార్థం వేడుక జరిగింది. ఎంగేజిమెంట్ కు సంబందించిన పిక్స్ ను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో సినీ ప్రముఖులు, నెటిజన్స్ ఆమేకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.