బాలసుబ్రమణ్యం తన పాటలతో దేశ, విదేశాలలో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. 17 భాషల్లో 41 వేలు పాటలు పాడిన ఆయన శాశ్వతంగా సెలవంటూ దివికేగారు. ఆయన గొంతుక ఆగిపోవడంతో కోట్లాది గొంతులు మూగబోయాయి. తమ ప్రియమైన ‘గాన గంధర్వుడు’ లేరంటూ శోకసంద్రంలో మునిగిపోయారు. కరోనా కారణంగా కడసారి చూసే వీలులేని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులే గాక అన్నీ వర్గాలకు చెందిన వారు ఉండటం గమనార్హం.
ప్రముఖుల సంతాపాలు
రాష్ట్రపతి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్తమయంతో సినీ రంగం ఓ మధుర గాత్రాన్ని కోల్పోయిందని రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. ‘పాడుమ్ నిలా’, ‘పాటల చందమామ’ అంటూ అశేష అభిమాన జనం ఎంతో ప్రేమగా పిలుచుకునే ఎస్పీ బాలు పద్మభూషణ్ సహా అనేక జాతీయ అవార్డులు అందుకున్నారని రాష్ట్రపతి అన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నానని ప్రకటన చేశారు.
In the passing of music legend SP Balasubrahmanyam Indian music has lost one of its most melodious voices. Called ‘Paadum Nila' or ‘Singing Moon’ by his countless fans, he was honoured with Padma Bhushan and many National Awards. Condolences to his family, friends and admirers.
— President of India (@rashtrapatibhvn) September 25, 2020
వైస్ ప్రెసిడెంట్: ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, ఐదున్నర దశాబ్దాలుగా తన అమృత గానంతో ప్రజలను అలరింపచేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారినపడ్డారని తెలిసినప్పటి నుంచి డాక్టర్లతో రోజూ మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నానని వెల్లడించారు. బాలు కుమారుడితో కూడా మాట్లాడి కావాల్సిన సలహాలు ఇస్తూ, వైద్యులకు సూచనలు చేస్తుండేవాడినని తెలిపారు.
కానీ, బాలు కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలో ఇలా జరగడం విచారకరం అని వెంకయ్యనాయుడు ట్విట్టర్ లో స్పందించారు.
ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్ధాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది.#SPBalasubrahmanyam pic.twitter.com/j6cHkIRESO
— Vice President of India (@VPSecretariat) September 25, 2020
ప్రధాని: దిగ్గజ గాయకుడు సింగర్ ఎస్పీ బాలు కన్నుమూసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్పీ బాలు మరణం దురదృష్టకరం అన్న ప్రధాని, మన సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బాలు పేరు ప్రతి ఇంటా వినిపించేదని, దశాబ్దాలుగా ఆయన మధుర కంఠస్వరం, సంగీతం శ్రోతలను అలరించిందని తెలిపారు. ఈ విచారకర సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు.
With the unfortunate demise of Shri SP Balasubrahmanyam, our cultural world is a lot poorer. A household name across India, his melodious voice and music enthralled audiences for decades. In this hour of grief, my thoughts are with his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) September 25, 2020
కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్: సంగీతానికి ఓ మధుర సంగీత మాల శకం నేడు ముగిసింది. ఆ దేవుడు అతని ఆత్మకి శాంతి కలిగించాలని కోరుకుంటున్నాను…ఓం శాంతి
भारत की मधुर संगीतमाला का एक सुरीला स्वर ‘पद्मभूषण’ श्री एसपी बालसुब्रमण्यम आज शांत हो गए . अब यह स्वर सुनाई तो देगा मगर दिखाई नहीं देगा. ईश्वर उनकी दिवंगत आत्मा को शांति दे और उनके परिवारजनों, मित्रों और करोड़ों चाहने वालों को यह दुःख सहने की शक्ति प्रदान करे | ॐ शांति 🙏
— Prakash Javadekar (@PrakashJavdekar) September 25, 2020
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.#RIPSPB
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 25, 2020
తెలంగాణ సీఎంఓ: సినీ గాయకుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన శ్రీ బాలు భారతీయ ప్రజలందరికీ అభిమాన గాయకులు అయ్యారని అన్నారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరమన్నారు.
సినీ గాయకుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన శ్రీ బాలు భారతీయ ప్రజలందరికీ అభిమాన గాయకులు అయ్యారని అన్నారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరమన్నారు.
— Telangana CMO (@TelanganaCMO) September 25, 2020
చంద్రబాబు నాయుడు: కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదు. రేపో మాపో ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్న బాలసుబ్రహ్మణ్యంగారు ఇక లేరన్న వార్త వినడానికే బాధాకరంగా ఉంది. ఆయన మరణంతో ఒక అద్భుత సినీ శకం ముగిసింది. ఇది దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటు
కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదు. రేపో మాపో ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్న బాలసుబ్రహ్మణ్యంగారు ఇక లేరన్న వార్త వినడానికే బాధాకరంగా ఉంది. ఆయన మరణంతో ఒక అద్భుత సినీ శకం ముగిసింది. ఇది దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటు.(1/2) pic.twitter.com/QPdvN7BaEf
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) September 25, 2020
నారా లోకేష్: ఆబాల గోపాలాన్ని తన గానంతో అలరించిన ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు కన్నుమూయడం.. సంగీత, సాహిత్య, సినీ, కళా ప్రపంచానికి తీరనిలోటు. దశాబ్దాలుగా భారతీయ భాషలన్నింటిలోనూ 40 వేలకు పైగా పాటలు పాడిన సుస్వరాల సుమధుర బాలు మనమధ్య లేకపోవచ్చు. ఆయన పాట, మాట, బాట, నటన, సంగీతం అన్నీ చిరకాలం జీవించే ఉంటాయి. గానగంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యంగారి కుటుంబానికి, అశేషాభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను..
ఆబాల గోపాలాన్ని తన గానంతో అలరించిన ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు కన్నుమూయడం.. సంగీత, సాహిత్య, సినీ, కళా ప్రపంచానికి తీరనిలోటు. దశాబ్దాలుగా భారతీయ భాషలన్నింటిలోనూ 40 వేలకు పైగా పాటలు పాడిన సుస్వరాల సుమధుర బాలు మనమధ్య లేకపోవచ్చు.(1/2) pic.twitter.com/R3wlpaAmfg
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 25, 2020
కేటీఆర్: సినీ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటులు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి విచారకరం. సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు, వారి అభిమానులకు తీరని లోటు. ఆలపించిన ఎన్నో వేల పాటల ద్వారా వారు ప్రజల మనసుల్లో సుస్థిరంగా నిలుస్తారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి
సినీ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటులు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి విచారకరం. సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు, వారి అభిమానులకు తీరని లోటు. ఆలపించిన ఎన్నో వేల పాటల ద్వారా వారు ప్రజల మనసుల్లో సుస్థిరంగా నిలుస్తారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: మంత్రి @KTRTRS pic.twitter.com/KOPlloEAEt
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 25, 2020
హరీష్ రావు: గానగంధర్వుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణం దురదృష్టకరం. సినిలోకానికి వారు చేసిన సేవలు వెలకట్టలేనివి. అనేక భాషలలో పాటలుపాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న బాలు గారు లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
గానగంధర్వుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణం దురదృష్టకరం. సినిలోకానికి వారు చేసిన సేవలు వెలకట్టలేనివి. అనేక భాషలలో పాటలుపాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న బాలు గారు లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/guKWenbLN7
— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) September 25, 2020
విజయసాయి రెడ్డి: లెజెండరీ సింగర్ బాలు గారి మరణం షాక్ కు గురి చేసింది. 16 భాషల్లో 40 వేల పాటలు పాడి ఆయన చరిత్ర సృష్టించారు. ఆయన మనతో లేకపోవచ్చు కానీ ఆయన పాటలతో మనకు గుర్తుండి పోతారు.
My deep condolences to the family of the greatest playback singer of all time SP Balasubramanyam. He has the rare distinction of working in 16 languages and has recorded over 40K songs. He may not be with us but his ever green songs and legacy are carried forward for generations.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 25, 2020
కృష్ణ: బాలు మనతో లేకపోయినా ఆయన పాడిన అద్భుతమైన పాటలతో మనతో కలిసే ఉంటారు.
బాలు మనతో లేకపోయినా ఆయన పాడిన అద్భుతమైన పాటలతో మనతో కలిసే ఉంటారు.
– కృష్ణ#Krishna Gari condolences over the demise of #SPBalasubrahmanyam garu #RIPSPB pic.twitter.com/c91FapfN8o— BARaju (@baraju_SuperHit) September 25, 2020
చిరంజీవి: సంగీత జగత్తుకు ఇది ఒక చీకటి రోజు. ఒక శకం ముగిసింది. నేను ఈ స్థాయిలో ఉండటానికి బాలు గారు ఒక కారణం. వందలాది సూపర్ హిట్ సాంగ్స్ ఆయన నాకు ఇచ్చారు. ఘంటశాల గారి మరణం తరువాత ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఈ సమయాన తానున్నానంటూ బాలు వచ్చారు…ఆ స్థానాన్ని భర్తీ చేశారు. ఆయన తన పాటలతోనే హద్దులు చెరిపేశారు. బాలు మరణంతో ఓ వాక్యూమ్ ఏర్పడింది. దీనిని తిరిగి పుట్టి బాలు తప్ప ఎవరూ భర్తీ చేయలేరు. మీ ఆత్మకు శాంతి కలుగుగాక అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Heartbroken!! RIP SP Balu garu. pic.twitter.com/YTgZEBdvo9
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 25, 2020
నందమూరి బాలకృష్ణ: బాలు గారిని ప్రతి క్షణం తలుచుకుంటూనే ఉంటాను.
బాలు గారిని ప్రతి క్షణం తలుచుకుంటూనే ఉంటాను. – నందమూరి బాలకృష్ణ#NandamuriBalakrishna's condolence message over the demise of #SPBalasubrahmanyam Garu pic.twitter.com/ehAmz81fKw
— BARaju (@baraju_SuperHit) September 25, 2020
పవన్ కళ్యాణ్: బాలు మరణం సంగీత జగత్తుకు తీరని నష్టం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
JanaSenaParty Chief PawanKalyan paid his deep Condolences to Legendary Singer Sri S.P.Balasubrahmanyam garu #RIPSPB pic.twitter.com/gwDng37lBl
— BARaju (@baraju_SuperHit) September 25, 2020
రాజమౌళి: ‘బాలు గారు తెలుగు, తమిళం, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదు. ఆ ఏలిక మరి రాదు. చాలామంది తమిళ కన్నడ సోదరులు ఆయన తెలుగు వాడంటే ఒప్ప్పుకునేవారు కాదు. బాలు మావాడు అని గొడవ చేసేవారు. అన్ని భాషలలోను పాడారు. అందరిచేత మావాడు అనిపించుకున్నారు. ఈ ఘనత ఒక్క బాలు గారికే సాధ్యం. ఆయన పాడిన పాటలు మిగిల్చిన అనుభూతులు తరతరాలకీ కొనసాగుతాయి. మహోన్నతమైన ఆయన గాత్రానికి భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
బాలు గారు తెలుగు, తమిళం, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదు. ఆ ఏలిక మరి రాదు.
— rajamouli ss (@ssrajamouli) September 25, 2020
అమీర్ ఖాన్: బాలు మరణవార్త దిగ్బ్రాంతిని కలిగించింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. దిగ్గజాన్ని పోగొట్టుకున్నాం. రెస్ట్ ఇన్ పీస్ సర్
Deeply saddened to hear of the demise of Shri S P Balasubrahmanyam . My heartfelt condolences to the family 🙏 .
We have lost one of the most talented artistes of our times.
Rest in Peace sir 🙏.
— Aamir Khan (@aamir_khan) September 25, 2020
సల్మాన్ ఖాన్: బాలసుబ్రహ్మణ్యం గారి గురించి షాకింగ్ న్యూస్ విన్నాను. సంగీతం ఉన్నంత వరకు ఆయన ఉంటారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్ చేశారు.
Heartbroken to hear about #SPBalasubrahmanyam sir… you will forever live on in your undisputed legacy of music! condolence to the family #RIP
— Salman Khan (@BeingSalmanKhan) September 25, 2020
అరవింద్ కేజ్రీవాల్: ఢిల్లీ సీఎం బాలు మృతి పట్ల తీవ్ర విచారాన్ని తెలియచేశారు. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక అంటూ ట్వీట్ చేశారు.
Saddened to know about the passing away of legendary singer SP Balasubrahmanyam ji. Condolences to the family and millions of fans of legendary voice. May God bless his soul. #RIPSPB
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 25, 2020
మమ్మూటీ: సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. బాలు ఓ దిగ్గజ గాయకుడు. ఆయన లేని లోటు తీర్చలేనిది.
"Sangeetha swarangal ezhae kanakkaa
Innum irukkaa"
SPB – The True Legend. RIP#SPBalasubrahmanyam pic.twitter.com/PDVawVy5QJ— Mammootty (@mammukka) September 25, 2020
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు: ‘‘బాలు ఇక లేరంటేనే బాధగా దిగులుగా ఉంది. మనసు మెలిపెట్టినట్టు ఉంది. ఆయన గంధర్వ గాయకుడే కాదు.. నాకు అత్యంత ఆత్మీయుడు. గుండెలకు హత్తుకుని ప్రేమగా పలకరించే తమ్ముడు. తెలుగు జాతికేకాదు ప్రపంచ సంగీతానికే ఆయన స్వరం ఓ వరం. 50 సంవత్సరాల ఆయన సినీ ప్రయాణంలో జాలువారిన వేల వేల పాటలు తేట తీయని తేనెల ఊటలు. ఎన్ని గానాలు.. ఎన్ని గమకాలు..ఎన్ని జ్ఞాపకాలు.. ఏం గుర్తుకు వచ్చినా ఈ క్షణంలో కురిసేవి కన్నీటి జలపాతాలే. మా కోసం మధురమైన పాటలెన్నో మిగిల్చి మరలిపోయిన స్నేహితుడికి తిరిగి కనీసం మాటలు కూడా ఇవ్వలేని మహా విషాదమిది. బాలు.. నీకిదే మా అందరి అశ్రుతర్పణం’’…
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి:ఎస్పీ బాలసుబ్రమణ్యం భౌతికంగా దూరమైనా పాట రూపంలో ప్రజలలో బతికే ఉంటారు. నటుడు , గాయకుడుగా సినీరంగంలో వారి స్థాయిని అందుకోవడం అసాధ్యం. 50 రోజులు వైద్యుల శ్రమ ఫలించక పోవడం బాధాకరం. బాలసుబ్రమణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.
పూరి జగన్నాథ్: మిస్ యూ సర్
Miss you sir 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 pic.twitter.com/VFZ35JM1K0
— PURIJAGAN (@purijagan) September 25, 2020
మోహన్ బాబు: శ్రీకాళహస్తిలో మేమిద్దరం కలిసి చదుకున్నాం. నాకు అత్యంత ఆప్తుడు, ఆత్మీయుడు, శ్రీవిద్యానికేతన్ లో ఏ కార్యక్రమం జరిగినా బాలు రావాల్సిందే. మార్చి 19న నా పుట్టిన రోజుకు కరోనా కారణంగా ఆయన రాలేకపోయారు. ఈ మధ్య కూడా ఫోన్ లో మాట్లాడుకున్నాం. బాలు మరణం నన్నెంతో బాధించింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
I am deeply saddened and devasted by the death of my good friend. During the times when I worked as an Assistant Director in Chennai, I had borrowed 100 rupees from him. Till recent times, Balu used to remind me of the debt and used to make fun of me for interest to pay. pic.twitter.com/IzHNMpMR7E
— Mohan Babu M (@themohanbabu) September 25, 2020
విజయశాంతి: గాన గంధర్వుడు శ్రీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేనిది. కోట్లాదిమందికి గానామృతాన్ని పంచిన శ్రీఎస్పీబీ త్వరగా కోలుకుని మళ్ళీ తన గానంతో అలరిస్తారని ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారన్న వార్త తీవ్రంగా కలచివేసింది.
గాన గంధర్వుడు శ్రీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేనిది. కోట్లాదిమందికి గానామృతాన్ని పంచిన శ్రీఎస్పీబీ త్వరగా కోలుకుని మళ్ళీ తన గానంతో అలరిస్తారని ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారన్న వార్త తీవ్రంగా కలచివేసింది. pic.twitter.com/x8rVGEodQW
— VijayashanthiOfficial (@vijayashanthi_m) September 25, 2020
దర్శకుడు శంకర్: ప్రేక్షకులకు చేరకముందే ఓ పాటను హిట్ చేసే దమ్ము ఉన్న గాయకుడు బాలు గారు ఒక్కడే. ఆయనను మనం కోల్పవడం మన దురదృష్టం. ఆయన గొంతు మనతోనే ఎప్పటికీ ఉంటుంది.
Only a very few singers have the quality,they sing a song and it will be a hit even before it reaches the audience. SPB sir was the top among them. We lost him, not his voice. It will always be in the air🙏 pic.twitter.com/5FuZJ6Tyrj
— Shankar Shanmugham (@shankarshanmugh) September 25, 2020
తనికెళ్ళ భరణి: బాలు..జ్ఞాపకాలు
బాలూ.. జ్ఞాపకాలూ…#SPBalasubrahmanyam pic.twitter.com/jY8uTYFMPb
— Tanikella Bharani (@TanikellaBharni) September 25, 2020
రామ్ పోతినేని: గుండె పగిలింది. తరతరాలకు మీరే ఓ ఇన్స్పిరేషన్. థాంక్యూ సర్. రెస్ట్ ఇన్ పీస్ బాలు సర్
Heartbroken 💔…the singer who made me realise that you could act/express so much through your voice…you shall still be an inspiration for many generations to come…Thank you sir!🙏 #ripspb garu! pic.twitter.com/EXXWAgAixI
— RAm POthineni (@ramsayz) September 25, 2020
చిత్ర: ఓ శకం ముగిసింది. ఓ కంప్లీట్ సింగర్ గా నన్ను తయారు చేయడంలో ఆయన ప్రధాన భూమిక పోషించారు. మీరు లేకుండా కన్సర్ట్ ఊహించలేకపోతున్నా బాలు గారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
An era is over. Music will never be the same. World will never be the same. Words are not enough to Thank him for guiding me to be a better singer. Cannot think about a concert without your great & gracious presence. Condolences &prayers to Savithriamma,Charan,Pallavi & Family.🙏 pic.twitter.com/vIteV53TRf
— K S Chithra (@KSChithra) September 25, 2020
మోహన్ లాల్: సంగీత ప్రపంచానికి అతి పెద్ద నష్టం. ఆయన మరణవార్తను జీర్ణించుకోలేక పోతున్నాను. రెస్ట్ ఇన్ పీస్ సర్..
A true loss to the world of Music…Heart breaking … May his soul Rest in Peace. pic.twitter.com/3KG1JOcGLG
— Mohanlal (@Mohanlal) September 25, 2020
నాగార్జున అక్కినేని: ఆయనతో గడిపిన స్మృతులను తలుచుకుంటే కన్నీళ్లు ఆగడం లేదు. అన్నమయ్య సినిమా తరువాత ఆయన నుంచి వచ్చిన ఫోన్ కాల్ ను నేను మరిచిపోలేను. దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో !
As the memories and conversations with Balu Garu come flooding back so do the tears… I still remember the call I got from him after my film Annamayya🙏He was such a unsaid integrable part of my life… దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో ! #ripspb 🙏 pic.twitter.com/pK8jYS5ONs
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 25, 2020
వెంకటేష్ దగ్గుబాటి: బాలు గారి మరణ వార్త చాలా బాధను కలిగించింది. ఓ దిగ్గజాన్ని మనం కోల్పోయాం. ప్రేమ, పవిత్రబంధం లాంటి సినిమాలలో ఆయనతో నటించే అదృష్టం నాకు కలిగింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
Extremely sad to hear the news of SP Balasubramaniam Garu’s passing. We have lost a legend today. I’ve had the privilege to work with him in some of my best movies like Prema and Pavitra Bandham. Your legacy will live on Sir!
My heartfelt condolences to the family. RIP🙏 #RIPSPB pic.twitter.com/NjjcdSg2l1— Venkatesh Daggubati (@VenkyMama) September 25, 2020
చంద్రబోస్: మధ్యాహ్నం నుండి ఏకధారగా కన్నీళ్లు-భగవంతుడా…..
మధ్యాహ్నం నుండి ఏకధారగా కన్నీళ్లు-భగవంతుడా…..
— chandrabose (@boselyricist) September 25, 2020
సీతారామశాస్త్రి: బాలు గారి లేని పాటకు న్యాయం చేసేదెవరు. ఆయన మరణం విషాదాన్ని కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.
బాలు అన్నయ్య 🙏🏽🙏🏽🙏🏽https://t.co/ake4tOuiOE
— Sirivennela Official (@sirivennela1955) September 25, 2020
అమలా పాల్: పవర్ హౌస్ అఫ్ టాలెంట్ ను మేము మిస్ అవుతున్నాం. రెస్ట్ ఇన్ పీస్ సర్
We'll miss your smile amidst lyrics, powerhouse of talent. Rest in peace, beloved SPB Sir. 🌸#RIPSPBSir pic.twitter.com/dpaZbQRt1E
— Amala Paul ⭐️ (@Amala_ams) September 25, 2020
రామ్ గోపాల్ వర్మ: విషయం జీవించడం గురించి కాదు, కానీ అతను జీవించేటప్పుడు ఆ వ్యక్తి ఇతరుల జీవితాలకు ఏమి దోహదపడ్డాడనే దాని గురించి .. బాలసూబ్రహ్మణ్యం యొక్క భౌతిక అస్తిత్వం ముగిసింది, కానీ అతని స్వరం సంగీతం జీవించినంత కాలం బతుకుతూనే ఉంటుంది.
The point is not about living, but it is about what the person contributed to other people’s lives when he was living ..The physical entity of #SPBalasubrahmanyam ended, but his voice will live as long as music lives 🙏💐💐💐
— Ram Gopal Varma (@RGVzoomin) September 25, 2020
త్మీయుడు. గుండెలకు హత్తుకుని ప్రేమగా పలకరించే తమ్ముడు. తెలుగు జాతికేకాదు ప్రపంచ సంగీతానికే ఆయన స్వరం ఓ వరం. 50 సంవత్సరాల ఆయన సినీ ప్రయాణంలో జాలువారిన వేల వేల పాటలు తేట తీయని తేనెల ఊటలు. ఎన్ని గానాలు.. ఎన్ని గమకాలు..ఎన్ని జ్ఞాపకాలు.. ఏం గుర్తుకు వచ్చినా ఈ క్షణంలో కురిసేవి కన్నీటి జలపాతాలే. మా కోసం మధురమైన పాటలెన్నో మిగిల్చి మరలిపోయిన స్నేహితుడికి తిరిగి కనీసం మాటలు కూడా ఇవ్వలేని మహా విషాదమిది. బాలు.. నీకిదే మా అందరి అశ్రుతర్పణం’’