వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి… పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నమ్మినబంటు.. జగన్ ఏది చెప్పినా, చేయడానికి ఆయన రెడీగా ఉంటారు.. జగన్ రాజకీయాల్లోకి రాకముందు నుండి… వైఎస్ ఫ్యామిలీకి సాయిరెడ్డి ఆడిటింగ్ సేవలు అందిస్తూనే ఉన్నారు. జగన్ వ్యాపారాలన్నింటికి సాయిరెడ్డే ఆడిటర్. ఇక కాంగ్రెస్ ను వీడి జగన్ వేరు కుంపటి పెట్టుకున్నంతనే… సాయిురెడ్డి రాజకీయాల్లోకి వచ్చేశారు. ఓ వైపు ఆడిటింగ్ వ్యవహారాలు చూసుకుంటూనే జగన్ పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తూ సాగారు. ఈ క్రమంలో వైసీపీకి దక్కిన తొలి రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్న సాయిరెడ్డి… వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. కొన్నిసార్లు సాయిరెడ్డి తీసుకున్న నిర్ణయాలు జగన్ కు కోపం తెప్పించినా… ఆయనను పక్కనపెట్టే విషయాన్ని జగన్ అసలు పరిగణనలోకి తీసుకోలేదని చెప్పాలి.
నమ్మిన బంటు లాంటి సాయిరెడ్డి నుంచి జగన్ కు వెన్నుపోటు ఎదురైతే పరిస్థితి ఏమిటి? ఏముంది.. పంటి బిగువున బాధ, కోపాన్ని భరిస్తూ అలా సాగిపోవడమే. అయినా జగన్ కు సాయిరెడ్డి వెన్నుపోటు పొడుస్తారా? అంటే… పొడుస్తారా? కాదు… ఆల్రెడీ పొడిచేశారు కూడా. నిజమా?…అని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే…కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో తనను తాను రక్షించుకునే క్రమంలో సరిగ్గా… జగన్ విదేశాలకు వెళ్లిన సమయం చూసుకుని మరీ… జగన్ కు సాయిరెడ్డి వెన్నుపోటు పొడిచేశారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది… ఈ విషయం జగన్ కు ఇప్పటికైనా తెలిసిందో, లేదో తెలియదు గానీ…తెలిస్తే మాత్రం ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.
కాకినాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) ఆధ్వర్యంలో కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్ లు విజయవంతంగా నడుస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి రాగానే.. వీటిపై కన్నేసిన జగన్ వాటిని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలనుకున్నారు. జగన్ మనసును చదివిన సాయిరెడ్డి..కేవీ రావును భయపెట్టి కాకినాడ సీ పోర్టును కారు చౌకగా అరబిందో ఫార్మాకు దక్కేలా చేశారు. కాకినాడ సెజ్ నూ లాగేసుకున్నారు. ఈ రెండూ కాగితాలపై అరబిందో ఫార్మా అనుబంధ కంపెనీలకు దక్కినట్లుగా చెబుతున్నా… అంతిమంగా అవి జగన్ ఖాతాలో పడిపోయాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి.. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టడంతో కేవీ రావు ఈ దుర్మార్గంపై సీఐడీకి ఫిర్యాదు చేశారు. సీఐడీ కేసు ఆదారం చేసుకుని ఈడీ కూడా కేసు నమోదు చేసింది.
ఈడీ ఈ కేసు వివరాలను కాస్తంత లోతుగా తవ్వుతోందన్న సమాచారం సాయిరెడ్డి వెన్నులో వణుకు పుట్టేలా చేసింది. ఈ క్రమంలో కేవీ రావుతో పరిచయం ఉన్న కొందరితో టచ్ లోకి వెళ్లిన సాయిరెడ్డి… కాకినాడ సెజ్ ను తిరిగి ఇప్పించేస్తా… కేసును విత్ డ్రా చేసుకోవాలంటూ కాళ్ల బేరానికి వచ్చారట. జరిగిందేదో జరిగింది… రాజీ కుదుర్చుకోవాలంటూ తన సన్నిహితుల ద్వారా రావుకు చెప్పించారట. దీంతో రావు మెత్తబడిపోయారు. జగన్ కు ముట్టజెప్పిన కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్ లను ఆయన కళ్లెదుటే తిరిగి కేవీ రావుకు రాసిచ్చేయడం ఎలా? ఈ కేసు నుంచి బయటపడటం ఎలా? అన్న దిశగా సాయిరెడ్డి ఆలోచన చేశారు. సరిగ్గా… తన కుమార్తె గ్రాడ్యుయేషన్ సెరిమనీ కోసం జగన్ లండన్ వెళుతున్న విషయాన్ని గుర్తు చేసుకుని సాయిరెడ్డి పక్కా పథకాన్ని రచించుకున్నారని తెలుస్తోంది… జగన్ అలా లండన్ ఫ్లైట్ ఎక్కగానే… ఇక్కడ అరబిందో కంపెనీ నుంచి కాకినాడ సీపోర్టు షేర్లను తిరిగి కేవీ రావుకు బదలాయించేశారని సమాచారం… మొత్తమ్మీద అదను చూసి జగన్ కు సాయిరెడ్డి వెన్నుపోటు పోడిచేశారని వైసీపీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది..