రాష్ట్ర ప్రభుత్వాన్ని మరో గుబులు భయ పెడుతోంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని భావిస్తున్నా .. భయం మాత్రం వీడటం లేదు. గత నెల వరకు క్రమంగా పెరుగుతూ వచ్చిన కరోనా కేసులు ఈ నెలలో కాస్తా తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. దాని తీవ్రత కూడా పెద్దగా లేకుండా పోయిందని డాక్టర్లు చెబుతున్నారు. ఇన్ పేషెంట్ల కంటే డిశ్చార్జ్ లు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పడం శుభసూచకమే. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పండగ సీజన్ మొదలు కావడంతో అంతా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పరిణామాలు ఎలా ఉంటాయో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కేంద్ర మంత్రి హర్షవర్దన్ కూడా వచ్చే శీతా కాలంలో కరోనా విజృంబించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇక నేటి నుండి తెలంగాణలో అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే బతుకమ్మ పండగ ప్రారంభమైంది. నగరాల నుండి గ్రామాల వరకు మహిళలు పెద్ద ఎత్తున ఒకే చోట గుమిగూడి బతుకమ్మ ఆడుతుంటారు. ఈ క్రమంలో కరోనా ఏ ఒక్కరికి ఉన్నా అందరికీ వ్యాపించే ప్రమాదం ఉందని ప్రభుత్వం భయపడుతోంది. కరోనా ఎవరికి ఎలా సోకుతుంది.. ఎక్కడ సోకుతుందో ఎవరికీ క్లారిటీ లేదు. డబ్య్లూ హెచ్ఓ సైతం ఈ విషయంలో ఏటూ తేల్చలేక పోతోంది. ఆ సంస్థ చేస్తున్న ప్రకటనలు కూడా ప్రజలను గందర గోళానికి గురిచేస్తున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు సాగుతున్నా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియడం లేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం తప్ప వేరే మార్గం లేదని కరోనా ప్రారంభమైన నాటి నుండి చెబుతున్నారు. తెలంగాణలో ఆందోళన పరిస్థితులు ఏమీ లేవని అయినా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. కరోనా వచ్చినా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్న ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రులు చెబుతున్నారు.
ఇక రాష్ట్రంలో కరోనా టెస్టులు నిరంతరం కొనసాగుతున్నాయి అన్నారు. బతుకమ్మ పండగ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు గుమిగూడ కూడదని.. ఎవరి అప్రమత్తతో వారుండాలని హెచ్చరిస్తోంది . ఇక బతుకమ్మ పండగను జరపకూడదని ఎటువంటి నిబందనలు పెట్టని తెలంగాణ సర్కార్ భౌతిక దూరం పాటించాలని సూచిస్తోంది. ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు , అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని సూచిస్తోంది. కరోనా నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు తప్పకుండా పాటించాలని.. ప్రజలంతా కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని సూచిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు.
విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్ సవారీ..
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...











