అమెరికా, బ్రెజిల్ తర్వాత ఒక్క రోజులో నాలుగు వేలకుపైగా కరోనా మరణాలు నమోదవడం భారత్‌లోనే కావడం గమనార్హం. ఇప్పటివరకు ఒక్కరోజులో అత్యధికంగా జనవరి 12న అమెరికాలో 4490 మంది మృతిచెందారు. కాగా, దేశంలోవరుసగా మూడో రోజూ నాలుగు లక్షలకుపైగా మంది కరోనా బారినపడ్డారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 4,01,078 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,18,92,676కు చేరింది. ఇందులో 1,79,30,960 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 37,23,446 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 2,38,270 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 4187 మంది మృతిచెందగా, కొత్తగా 3,18,609 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని వెల్లడించింది. ఇక 16,73,46,544 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది. కరోనా కట్టడికి కొన్ని స్టేట్స్ లాక్ డౌన్ పాటిస్తుండగా, మరికొన్ని పాక్షిన్ లాక్ డౌన్ పాటిస్తున్నాయి.
ఊపిరితిత్తుల సమస్యకు పావురాల వ్యర్ధాలు కారణమా ?
పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలి పీల్చడంతో ఊపిరితిత్తుల సమస్య తలెత్తుతుందా ?...