స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – ఇంటిలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం పుష్ప. బన్నీ ఇప్పటి వరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా రూపొందుతోన్న పుష్ప షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంతో సాగే ఈ విభిన్నమైన కథా చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి అప్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ మూవీ నేపధ్యం ఎర్రచందనం స్మగ్లింగ్ కాబట్టి ఎక్కువుగా ఈస్ట్ మారేడుమిల్లి ఫారెస్ట్ లో షూటింగ్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం అక్కడే షూటింగ్ జరుగుతుంది. అయితే.. ఈ మూవీ షూటింగ్ ను విదేశాల్లో కూడా ప్లాన్ చేశారట. నెక్ట్స్ షెడ్యూల్ ను విదేశాల్లోనే ప్లాన్ చేశారని తెలిసింది. అడవులు చుట్టూ తిరిగే ఈ కథలో విదేశాలకు ఎందుకు వెళ్లాల్సివస్తుంది అంటే.. ఊహకందని ట్విస్ట్ ఉంటుందట.
ఇంతకీ.. ఆ ట్విస్ట్ ఏంటి..? అడవుల్లో ఉండే బన్నీ.. విదేశాలకు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది.? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మొత్తానికి పుష్ప స్టోరీలో ట్విస్టులు బాగానే ఉన్నాయని తెలిసింది. ప్రతి సీన్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. దీంతో పుష్ప మూవీ పై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని సమ్మర్ ఎండింగ్ కి షూటింగ్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు. ఆర్య, ఆర్య 2 చిత్రాలతో ఆకట్టుకున్న బన్నీ – సుక్కు పుష్ప మూవీతో హ్యాట్రిక్ సాధిస్తారని ఆశిద్దాం.
Must Read ;- హాట్ టాపిక్ గా మారిన సుకుమార్ రెమ్యూనరేషన్