Covid 19 News Update in India :
సేకండ్ వేవ్ దేశ ప్రజల్ని మరింత భయపడుతోంది. రోజుల వ్యవధిలోనే లక్షకుపైగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,68,912 కేసులు నమోదవడం గమనార్హం. మరో 904 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన వాళ్ల మొత్తం సంఖ్య 1.35 కోట్లకు చేరగా, మరణించిన వారి సంఖ్య 1,70,179కి చేరింది. వరుసగా 33వ రోజు కూడా దేశంలో క్రియాశీల కరోనా కేసులు పెరిగాయి. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న వాళ్ల సంఖ్య 75,086గా ఉంది.
ప్రస్తుతం దేశంలో క్రియాశీల కరోనా కేసులు 12,01,009 ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 10 కోట్ల 45 లక్షల వ్యాక్సిన్ డోసులు వేశారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్ మినిస్టర్ ఎప్పటికప్పుడు వైద్యాధికారులతో సమావేశమవుతున్నారు. కరోనా ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే 20 వేల బెడ్లు సిద్ధంగా ఉంచినట్లు, రోజుకు 7 వేలకుపైగా టెస్టులు చేస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ నిల్వలు తగినంత లేవని, వెంటనే డోసులు పంపాలని ఏపీ ఆరోగ్య శాఖ కేంద్రానికి విన్నవించుకుంది.