ఆరు నెలల్లో ఆవిరైపోయిన వేలకోట్లు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్ధిక నిర్వహణ, క్రమశిక్షణ వంటి అంశాలు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. సంక్షేమ పథకాలతోనే రాజకీయంగా అన్ని అయిపోతాయని, సుస్థిర పాలనకు శ్రీకారం చుట్టొచ్చని భావించి ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వాస్తులను తాకట్టుపెట్టి మరి పథకాల అమలకు నిధులను డైవర్ట్ చేశారు. దీంతో అభివృద్థి కుంటుబడింది. రోడ్లు, తాగునీటి,సాగునీటి ప్రాజెక్టులు పురోగతిని గాలికొదిలేసి మరి నవరత్నాలను తట్టలో పెట్టుకుని బఠానీలను పంచినట్లు భవిష్యుత్తును పంచేశారు. చివరికి రాష్ట్రాన్ని ఆర్థికంగా అధ:పాతాళానికి కురుకుపోయేలా చేశారు. రాష్ట్రాదాయం, వ్యయం వంటి వాటిపై ఎప్పటికప్పుడు ఆర్థికశాఖ అధికారులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా .. చెవిటి వాడి ముందు శంఖరావంగా అన్న చందంగా లెక్కపెట్టడంలేదు. గడిచిన ఆరునెలల్లో ఆదాయం రూ.40 వేల కోట్లు ఉన్నా.. లోటు ఏకంగా 662 శాతంగా తెలిందని నిపుణులు అంచన వేస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లోనే బడ్జెట్ అంచనాలకు మించి ఆర్థిక లోటు ఏకంగా 662 శాతం అధికంగా నమోదు అవ్వడం సర్వత్ర విమర్శలకు దారితీస్తోంది.
కుప్పకూలీన ఆర్థిక వ్యవస్థ తేరుకోవడం కష్టం!
ఏపిలో కప్పకూలుతున్నఆర్థిక వ్యవస్థను నిలబెట్టడం అంటే చాలా కష్టతరమని నిపుణుల తెల్చేశారు. రెవిన్యూ లోటు అంచనా రూ. 5 వేల కోట్లు ఉంటే .. ఆరు మాసాల్లో అది కాస్తా రూ.33 వేల కోట్ల లోటుకు ఎగబాకింది. ఏపీ ప్రభుత్వ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో రెవిన్యూ లోటును రూ. 5000.08 కోట్లుగా నిర్థారించారు. ఇది కాస్తా తొలి ఆరుమాసాల్లో ఏకంగా రూ. 33,140.62 కోట్లుగా నమోదు అయ్యింది. అంటే దాదాపు 662 శాతం అధికంగా నమోదు కావడంతో ఆర్థికంరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం లోటును భర్తీ చేసుకోవడం అసాధ్యమని తేల్చి చెప్పారు. ఆదాయానికి, ఖర్చులకు మధ్య పొంతన లేకపోవడమే దీనికి కారణం. వస్తున్న ఆదాయానికి చేస్తున్న చెల్లింపులకు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని నిపుణులు వాదిస్తున్నారు. జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు చెల్లింపులు సహా అనేక అంశాల్లో ప్రభుత్వం చెల్లిపులకు అవసరమైన నిధులు .. వస్తున్న ఆదాయానికి పొంతన ఉండటంలేదు. దీంతో వస్తుంది ఆదాయం గోరంతైతే.. ఖర్చులు అధిక భారమౌతున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Must Read ;- ‘డిఫాల్టర్’ముద్రతో ఏపీలో ఆర్థిక అఘాతం!