‘ఆర్. ఎక్స్ . 100’ సినిమాతో టాలీవుడ్ లో సంచలన దర్శకుడు అయిపోయాడు అజయ్ భూపతి. ఆ సినిమా తెచ్చిపెట్టిన సూపర్ క్రేజ్ తో ఈ దర్శకుడు ఈ పాటికి వరుస ఆఫర్స్ ను దక్కించుకోవాలి లెక్క ప్రకారం. అయితే అలా.. వరుస సినిమాలు చేయకుండా.. కేవలం ఒకే ఒక్క సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమాకి ‘మహాసముద్రం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసిన అజయ్ భూపతి.. దానికి తగ్గ నటీనటుల్నే ఎంపిక చేశాడు.
వైజాగ్ బీచ్ బ్యాక్ డ్రాప్ లో సాగే .. యాక్షన్ లవ్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ‘మహా’ అనే అమ్మాయి ప్రేమ కోసం ఓ ఇద్దరు యువకులు ఏ చేశారు? ఆమె ప్రేమను దక్కించుకొనే ప్రయత్నంలో వారు ఎలాంటి మార్గాన్ని అనుసరించారు? అన్నదే ఈ సినిమా కథాంశం. శర్వానంద్ , తమిళ హీరో సిద్ధార్ధ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. మహా అనే అందమైన అమ్మాయి గా అదితీరావు హైదరి నటిస్తోంది.
Aditi Rao Hydaris First Look from Mahasamudram Movie Released :
ఆగష్ట్ 19న ఈ సినిమా విడుదల కానుండడంతో .. ప్రచార కార్యక్రమాల్ని కూడా ముమ్మరం చేశారు. అందులో భాగంగా.. కథానాయిక అదితీరావు హైదరి లుక్ ను విడుదల చేశారు. మహా పాత్రలో . ఎమోషనల్ గా కనిపిస్తున్న ఆ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ‘మహా సముద్రం’ సినిమా అదితీరావు కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- ‘మహాసముద్రం’లో రంగమ్మత్త ఐటెమ్ సాంగ్?
Introducing the Fascinating Beauty @aditiraohydari as '𝐌𝐚𝐡𝐚' 💫
Soul of #MahaSamudram 🌊@ImSharwanand @Actor_Siddharth @ItsAnuEmmanuel @DirAjayBhupathi @AnilSunkara1 @kishore_Atv @chaitanmusic @Cinemainmygenes @AKentsOfficial @SonyMusicSouth pic.twitter.com/Mxko68WcML
— BARaju (@baraju_SuperHit) April 12, 2021