అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం ఆపి అధికారులు, మంత్రులతో మాట్లాడితే అసలు వాస్తవాలు తెలుస్తాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. జాబ్ లెస్ క్యాలెండర్ కాకుండా.. జాబ్ ఉన్న క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని సూచించారు. ఆత్మలతో కాకుండా అంతరాత్మతో మాట్లాడి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని అన్నారు. నిరుద్యోగులను నిలువునా ముంచేసిన జాబ్ లెస్ క్యాలెండర్‌ని రద్దు చేస్తూ, కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
2.30 లక్షల ఉద్యోగాలు ఎక్కడ..?
ఎన్నికల సమయంలో 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన జగన్ మాట తప్పారని ప్రతిపక్షాలతో పాటు నిరుద్యోగులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని, వేలాది మంది నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. గ్రూప్-1 అవకతవకలపై సీబీఐ విచారణ జరిపి నిజాలను తేల్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని, లేకపోతే ప్రభుత్వ విధానాలను ఎండగడుతామని హెచ్చరించారు. కోర్టు మొట్టికాయలు వేసినా జగన్ రెడ్డిలో మార్పురాలేదని అన్నారు. ఎన్నికల ముందు జాబు రెడ్డిగా ప్రకటించుకున్న జగన్.. డాబురెడ్డిగా మారారని నిరుద్యోగుల సంఘాల నాయకులు విమర్శించారు.
Must Read ;- కదం తొక్కిన నిరుద్యోగులు.. మంత్రుల ఇళ్లు ముట్టడి
అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం ఆపి కాసేపు మంత్రులతో, అధికారులతో మాట్లాడితే కొంతవరకైనా వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది @ysjagan గారు! నిరుద్యోగులను నిలువునా ముంచేసిన మీ జాబ్ లెస్ క్యాలెండర్ ని రద్దు చేస్తూ
క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి.(1/2)— Lokesh Nara (@naralokesh) June 30, 2021