చాప కింద నీరులా కరోనా విస్తరిస్తుండటంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఒకవైపు కరోనా వచ్చినా, లక్షణాలు బయటపడకపోవడం, మరోవైపు ఇతర స్టేట్స్ నుంచి కూలీలు, కార్మికులు కూడా హైదరాబాద్ బాట పడుతుండటంతో కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,478 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా 363 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15వేలు దాటింది.
దేశంలో రోజువారీ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు పైపైకి వెళ్తోంది. మునుపెన్నడూ లేని విధంగా మహమ్మారి కోరలు చాస్తున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,31,968 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 780 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కరోనా ప్రభావం దేశమంతటా విస్తరిస్తుండటంతో కొన్ని స్టేట్స్ ఇప్పటికే రాత్రి సమయంలో కర్ఫూ నిర్వహిస్తున్నారు. మరికొన్ని స్టేట్స్ పాక్షిక లాక్ డౌన్ విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Must Read ;- కరోనా కొత్త లక్షణాలు ఇవే.. ఉంటే టెస్టు చేయించుకోండి!