అసలే కరోనా.. ఇలాంటి సమయాల్లో పండగలు, కనీసం ఇంట్లో ఫంక్షన్ కూడా పెద్ద ఎత్తున చేసుకోవట్లేదు. ఇలా కరోనా కొనసాగుతున్న వేళ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెలవరించింది. జల్లికట్టు క్రీడకు అనమతులిచ్చింది. కానీ, కొన్ని నిబంధనల పాటిస్తూ మాత్రమే జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
జల్లికట్టులో 300 మంది పాల్గొనడానికి మాత్రమే అనుమతులు ఇచ్చింది. వారు కూడా ఆటకు రావడానికి ముందు కచ్చితంగా కరోనా పరీక్ష చేయించుకోవాలి. నెగిటివ్ సర్టిఫికెట్లు ఉన్నవారికి మాత్రమే అనుమతులు లభిస్తాయని ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. జల్లికట్టు చూడడానికి వచ్చే ప్రేక్షకుల విషయంలో కూడా నిబంధనలను విధించింది ప్రభుత్వం. మొత్తంగా 50 మందికి మాత్రమే అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రేక్షకులను లోపలికి అనుమతించే ముందు థర్మల్ స్క్రీనింగ్ ద్వారా పరీక్ష చేయాడం, భౌతిక దూరం, మాస్క్ ధరించడం వంటి వాటిని తప్పక పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తమిళనాడులోని మధురైలో జరిగే జల్లికట్టుకు పురాతనమైన క్రీడగా పేరుంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఒకానొక సమయంలో జల్లికట్లుపై నిషేధం విధించారు. 2017 జనవరి 8 నుండి 23 వరకు తమిళ ప్రజలు తమ నిరసనలను తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన వివాదం జాతీయ స్థాయికి చేరింది. అప్పటి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగి జల్లికట్లుకు తిరిగి అనుమతులు లభించేలా కృషి చేశారు.
Must Read ;- ‘ఆస్కార్’కు వెళ్లాక ‘జల్లికట్టు’ ఆహాలో ఇక ఓహో