తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఆయన వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. అయినా కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు కొవిడ్ సోకినట్లు సీఎస్ స్వయంగా వెల్లడించారు. అయితే ఈ ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిన్న సీఎం కేసీఆర్‌తో సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. దీంతో తనను కలిసినవాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. సోమేశ్ కుమార్ కు కరోనా అని తేలడంతో ఉన్నతాధికారులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారిక కార్యక్రమాల నిమిత్తం ఎంతోమంది అధికారులు ఆయనను కలిశారు. తమకు కూడా కరోనా వచ్చిందేమోనని ఆందోళన చెందుతున్నారు.
Must Read ;- కరోనా రికార్డు : ఒక్కరోజు ఇండియాలో ఇన్ని కేసులా..