తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమ విహారిని కేటీఆర్ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా విహారి.. బ్యాట్‌ను కేటీఆర్‌కు అందజేశారు. అనంతరం ఇరువురూ క్రికెట్ సంబంధిత అంశాలపై కాసేపు చర్చించుకున్నారు.
’క్రికెట్ గురించి సంభాషించడం చాలా ఆనందంగా ఉంది‘
ఆసీస్ పర్యటనకు సంబంధించిన విషయాలను విహారీ.. కేటీఆర్‌కు వివరించారు. మిమ్మల్ని కలవడం, క్రికెట్ గురించి సంభాషించడం చాలా ఆనందంగా ఉందని విహారి ట్విటర్లో పేర్కొన్నారు. కేటీఆర్‌తో దిగిన ఫొటోను విహారి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో అద్భుత డిఫెన్స్‌తో ఆకట్టుకున్న హనుమ విహారీ , రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తొడ కండరాల గాయం కారణంగా విహారి ఆఖరిదైన నాలుగో టెస్టుకు దూరం కావడంతో ఇటీవల స్వదేశం చేరుకున్నారు. మూడో టెస్టును టీమిఇండియా డ్రా చేయడంలో విహారి సైతం తనదైన పాత్ర పోషించారు.
విహారి ఆట తీరుపై మంత్రి కేటీఆర్ హర్షం
సిడ్నీ టెస్టులో హనుమ విహారి ఆడిన తీరుపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇదో అద్భుతమైన టెస్టు అని, భారత ఆటగాళ్ల తెగువ, పట్టుదల, ధైర్యాన్ని కొనియాడారు. ఒకవైపు ఆటగాళ్లు గాయాల బారిన పడినా, మరో వైపు జాత్యంహకార వ్యాఖ్యలు ఎదురైనా… ఏవీ జట్టు స్ఫూర్తిని దెబ్బతీయలేదని ప్రశంసించారు. ఈ డ్రా.. ఇన్నింగ్స్ విజయం కన్నా బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. అప్పుడు కేటీఆర్ ట్విట్‌పై స్పందించిన విహారి… ధన్యవాదాలు తెలిపారు.
Must Read ;- ఆనందానికి హద్దుల్లేవ్.. అభిజిత్‌కి రోహిత్ శర్మ ఊహించని గిఫ్ట్!












