ప్రస్తుత రాజకీయాల్లో కేటీఆర్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ మంత్రలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. యంగ్, డైనమిక్ నాయకుడు అని యువతలో ఫాలోయింగ్ కూడా ఎక్కువ. ఎప్పుడూ ఏవో ఒక కార్యక్రమాలతో బిజీగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి కేటీఆర్ తీవ్ర కృషి చేస్తున్నాడని చెప్పచ్చు. తాజాగా ఖమ్మంలో పలు కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్ రాష్ట్ర ఐటీ రంగ విస్తరణ, వికేంద్రీకరణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఖమ్మం కార్పొరేషన్ రాష్ట్రానికే ఆదర్శం
ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ రాష్ట్రానికే గర్వకారణమని పేర్కోన్నారు కేటీఆర్. ఖమ్మంలో నిర్మించిన ఐటీ హబ్, ఎన్ ఎస్ పి కెనాల్, మినీ ట్యాంక్ బండ్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ఐటీ హబ్ వికేంద్రీకరణకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని, త్వరలోనే రాష్ట్రమంతా ఐటీని విస్తరిస్తామని తెలియజేశారు. ఖమ్మంలోని ఫేజ్-2 కు సంబంధించిన నిధులు తొందరలోనే ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. ఖమ్మంలోని యువత ఈ ఐటి-హబ్ ని సద్వినియోగం చేసుకోవాలని, ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం హామీకి కట్టుబడి ఉందని తెలియజేశారు.
మంత్రి పువ్వాడ ఆదర్శనియ్యం
ఇలాంటి మంత్రి ఉండడం ఖమ్మం అదృష్టమని తెలియజేశారు. ఇక్కడకు రాగానే ఖమ్మం కోసం ఏమేమి చేశారో రిపోర్ట్ రూపంలో తెలియజేశారు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, ఎంత ఖర్చుపెట్టారో ప్రజల డబ్బును ఎంత జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారో తెలియపర్చారు. ఇలా పారదర్శకంగా పనిచేసే మంత్రి మా పాలనలో ఉండడం మాకు సంతృప్తినిస్తుంది. ప్రజల కోసం పాటుపడే వ్యక్తికి ఎప్పటికీ విలువంటుంది. ఒకసారి ప్రజలే ఈ ఊరు ముందేలా ఉందో, ఇప్పుడెంత అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలని కోరారు. ఇది ఇక్కడితో ఆగేది కాదని, మీ అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు.
Must Read ;- అమరావతికి ఇచ్చింది మట్టి, నీళ్లేగా.. బీజేపీ నేతలకు కేటీఆర్ కౌంటర్











