సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ఎనౌన్స్ చేసి చాలా రోజులు అయ్యింది కానీ.. ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. అమెరికాలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేశారు. అయితే.. అక్కడ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వడంతో లోకేషన్ ఛేంజ్ చేశారు.
జనవరి ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. జనవరి 25 నుంచి దుబాయ్ లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు జాయిన్ అవుతారు. దుబాయ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ లో తదుపరి షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు. ఈ క్రేజీ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇందులో నటించే నటీనటుల వివరాలను, ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను నిర్మాణ సంస్థ అఫిషియల్ గా ప్రకటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు.. సినిమాలతో వరుస విజయాలు సాధిస్తూ దూసుకెళుతున్న మహేష్ సర్కారు వారి పాటతో మరో సక్సస్ సాధించడం ఖాయమని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Must Read ;- మహేష్ నో చెప్పిన స్టోరీ బాలీవుడ్ కి వెళ్లిందా?