ఒంగోలు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్‌లో రూ.2 కోట్ల విలువైన సిటీ స్కాన్ యంత్రాల వైర్లను ఎలుకలు కొరికేశాయి. దీంతో నూతనంగా కొనుగోలు చేసిన సీటీ స్కానర్ పనిచేయడం మానేసింది. ఇటీవలే ఈ యంత్రాన్ని రూ.2 కోట్లతో కొనుగోలు చేశారు. కొద్ది రోజుల్లోనే ఈ యంత్రంలోని వైర్లను ఎలుకలు కొరికేయడంతో సిటీ స్కాన్ పనిచేయడం మానేసింది. రోజుకు 1500 మంది రోగులు వచ్చే జిల్లా సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎలుకల నివారణ ఎక్కడా?
ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టారు. దీంతో వారు పరిశుభ్రత మాత్రమే పట్టించుకుంటున్నారు. ఎలుకలు నివారించే యంత్రాంగం లేకుండా పోయింది. ప్రత్యేకంగా ఎలుకల నివారణకు శ్రద్ధ పెడితే తప్ప వాటిని అదుపు చేయడం సాధ్యం కాదు. కేవలం సిటీ స్కాన్ యంత్రాలే కాదు, పట్ట పగలే రోగుల మంచాలపై కూడా ఎలుకలు తిరుగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఎలుకల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఒంగోలు రిమ్స్‌లో వైద్యం పొందుతున్న రోగులు డిమాండ్ చేస్తున్నారు.
Must Read ;- అడుసు తొక్కనేల, కాళ్లు కడగనేల.. క్షత్రియులను శాంతింప చేయడానికి టీటీడీ ఛైర్మన్ పదవి?











