దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సోమవారం, సౌత్ ముంబైలోని ఓ హోటల్‌లో ఆయన మృతదేహం లభ్యమైంది. పోలీసుల సమాచారం ప్రకారం, ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆయన మృతి దేహాన్ని అస్పత్రికి తరలించారు. ఆయన మృత దేహం లభించిన చోట ఒక లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది గుజరాతీ భాషలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎంపీ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.
Must Read ;- వైసీపీ నేతల బెదిరింపులకు సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య











