ఊర మాస్ డైరెక్టర్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు బోయపాటి శ్రీను. మాస్ ని ఎలా మెప్పించాలో బోయపాటికి బాగా తెలుసు. తన సినిమాల్లో హీరోని ఊర మాస్ గా చూపించడంలో దిట్ట. కెరీర్ బిగినింగ్ లో రవితేజ, వెంకీలతో సినిమాలు తీసి హిట్ అందుకున్న ఆయన .. ఆ తర్వాత బాలయ్య తో ‘సింహా, లెజెండ్ మూవీస్ తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సాధించారు.
ఇప్పుడు మూడవసారి బాలయ్యతో సినిమా చేస్తున్నారు. దీంతో ఈసారి చేస్తున్న సినిమా పై అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సమ్మర్ లో ఈ క్రేజీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. ఈ సినిమా తర్వాత బోయపాటి తదుపరి చిత్రం ఎవరితో అనేది కన్ ఫర్మ్ కాలేదు కానీ.. సూర్యతో బోయపాటి మూవీ ప్లానింగ్ లో ఉన్నదని తెలిసింది.
ఇంతకీ.. ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోంది ఎవరో కాదు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. బోయపాటి కెరీర్ భద్ర సినిమాతో స్టార్ట్ అయ్యింది దిల్ రాజు బ్యానర్ లోనే. తర్వాత మళ్లీ దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయలేదు. ఎప్పటి నుంచో బోయపాటితో దిల్ రాజు సినిమా చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు బోయపాటి డైరెక్షన్ లో సూర్య హీరోగా తెలుగు, తమిళ్ లో ద్విభాషా చిత్రం ప్లాన్ చేస్తున్నారట. సూర్య కూడా ఎప్పటి నుంచో తెలుగులో స్ట్రైయిట్ మూవీ చేయాలనుకుంటున్నారు. మరి.. ప్లానింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Must Read ;- నానీ హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్న సూర్య