నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మర్ లో ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. ఈ సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేసేందుకు దర్శకులు శ్రీవాస్, బి.గోపాల్ రెడీగా ఉన్నారని.. కథలు రెడీ చేసారని వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు దర్శకులతో పాటు బాలయ్యతో సినిమా చేసేందుకు మరి కొంత మంది దర్శకులు కూడా లైన్ లో ఉన్నారని టాలీవుడ్ లో టాక్ వినిపించింది.

తాజా వార్త ఏంటంటే.. ఇటీవల మాస్ మహారాజా రవితేజతో క్రాక్ అని బ్లాక్ బస్టర్ మూవీని అందించిన మలినేని గోపీచంద్ బాలయ్య కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశారట. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎప్పటి నుంచో బాలయ్యతో సినిమా చేయాలనుకుంటుంది. ఇప్పుడు బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మూవీ ప్లాన్ చేస్తుందట. గోపీచంద్ రెడీ చేసిన స్టోరీ మైత్రీ వాళ్లకు బాగా నచ్చిందని తెలిసింది.
త్వరలోనే బాలయ్యకు గోపీచంద్ కథ చెప్పనున్నారని టాక్. అయితే.. బాలయ్య ఇంకా క్రాక్ మూవీ చూడలేదట. క్రాక్ మూవీ చూసిన తర్వాత గోపీచంద్ కి కబురు పంపుతారట. బాలయ్యను కథతో మెప్పిస్తే.. ఈ కాంబినేషన్ లో మూవీ ఫిక్స్ అయ్యినట్టే. దాదాపుగా ఈ సినిమా ఫిక్స్ అంటూ టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అయితే.. బాలయ్య ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత వెంటనే ఈ మూవీ చేస్తారా.? లేక వేరే సినిమా చేసిన తర్వాత చేస్తారా అనేది తెలియాల్సివుంది.
Must Read ;- తాత, బాబాయ్, తమ్ముడిలా తాను కూడా ఆ ప్రయోగం చేస్తాడట.. !











