స్థానిక ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. తాజాగా హైకోర్టు తీర్పు, ఎన్నికల షెడ్యూల్‌ను గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరించారు. స్థానిక ఎన్నికలకు సహకరించేలా ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వాలని నిమ్మగడ్డ గవర్నర్‌ను కోరినట్టు తెలుస్తోంది.
స్థానిక ఎన్నికలపై ముందుకే..
స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వేగంగా చర్యలు చేపట్టారు. కోర్టు తీర్పు వెలువడిన రోజే కలెక్టర్లతో కాన్ఫరెన్సు సమావేశం నిర్వహించారు. ఇవాళ గవర్నర్‌ను కలసి హైకోర్టు తీర్పు, స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను వివరించారు. ఇక సుప్రీంకోర్టులో కూడా ఇవాళ స్థానిక ఎన్నికలపై తీర్పు వెలువడితే నిమ్మగడ్డ మరింత వేగం పెంచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సహకరించని అధికారులను బదిలీ చేయాలని కూడా సీఎస్‌ను కోరునున్నారని సమాచారం.
Must Read ;- వీడని ‘స్థానిక’ చిక్కుముడి.. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంలో సవాల్