నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సింహ, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేసారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న టీజర్ రిలీజ్ చేసారు కానీ.. టైటిల్ ఎనౌన్స్ చేయలేదు. టైటిల్ ఏంటి అనేది ఇంకా కన్ ఫర్మ్ చేయలేదని సమాచారం. త్వరలోనే టైటిల్ కన్ ఫర్మ్ చేసి సంక్రాంతికి ఎనౌన్స్ చేయాలి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ క్రేజీ మూవీలో బాలయ్య రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారని.. ఇందులో అఘోరా క్యారెక్టర్ ఒకటని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలయ్య కానీ, బోయపాటి కానీ.. అఘోరా క్యారెక్టర్ పై క్లారిటీ ఇవ్వలేదు. ప్రచారంలో ఉన్న వార్తల పై స్పందించకపోవడంతో ఈ సినిమాలో బాలయ్య అఘోరా కనిపించడం నిజమే అంటున్నారు. రెండు పాత్రల్లో ఒకటి అఘోరా అయితే.. మరి రెండో క్యారెక్టర్ ఏంటంటే.. ఐఏఎస్ ఆఫీసర్ అంటున్నారు. రీసెంట్ గా ఈ వార్త బయటకు వచ్చింది. పవర్ ఫుల్ ఐఎఎస్ ఆఫీసర్ గా బాలయ్య క్యారెక్టర్ సినిమాకి హైలెట్ అవుతుందట.
ఈ క్యారెక్టర్ మాత్రమే కాకుండా.. ఓ వైపు అఘోరా క్యారెక్టర్ మరో వైపు ఐఎఎస్ క్యారెక్టర్ పర్ ఫార్మెన్స్ పరంగా రెండు పోటీపడి నటించేలా ఉంటాయట. అలా బాలయ్య రెండు పాత్రలను బోయపాటి డిజైన్ చేసారని టాక్ వినిపిస్తోంది. యంగ్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాని 2021 సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది. మరి.. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఎంత వరకు ఆకట్టుకుంటుందో..? ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read: రామ్ డైరెక్టర్ తో బాలయ్య టైటిల్ అదిరింది..!