ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రస్తుతం సెట్స్ మీదున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. నిజానికి ఆగస్ట్ 13న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ‘పుష్ప’ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటికే పుష్ప మొదటి భాగం దాదాపు పూర్తి కావచ్చింది. రెండో భాగం ఆల్రెడీ 10 శాతం చిత్రీకరణ పూర్తయింది. రెండు భాగాలకు కలిపి సుమారు రూ. 250 కోట్లు భారీ బడ్జెట్ ను పెడుతున్నారు.
ఇప్పటికే విడుదలైన ‘పుష్ప’ టీజర్ అంచనాల్ని పెంచేసింది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో .. రెడ్ సాండల్ స్మగ్లింగ్ కథాంశంతో థ్రిల్ చేసే ఈ సినిమా కోసం కథానాయికగా కన్నడ బ్యూటీ రష్మికా మందన్నను ఎంపిక చేసిన సుకుమార్, విలన్ గా మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ ను ఖాయం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణని కూడా సుకుమార్ అండ్ టీమ్ యాడ్ చేయబోతోందని తెలుస్తోంది. అదే.. ఐటెమ్ సాంగ్.
సుకుమార్ సినిమాల్లో ఖచ్చితంగా ఒక ఐటెమ్ సాంగ్ ఉండడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో పుష్ప సినిమాలో కూడా అదిరిపోయే ఐటెమ్ సాంగ్ ను ప్లాన్ చేశాడట సుక్కు. దీని కోసం మళ్ళీ జిగేల్ రాణి .. పూజా హెగ్డే ని రంగంలోకి దింపాలని చూస్తున్నాడట. ఆల్రెడీ రంగస్థలంలో ఆమె జిగేల్ రాణిగా .. ఏ రేంజ్ లో అలరించిందో తెలిసిందే. అందుకే మరోసారి పుష్ప కోసం పూజా హెగ్డేని సంప్రదించాడట. ఒకవేళ ఆమెకి కుదరని పక్షంలో మరో ఆప్షన్ గా దిశా పటానీని ఐటెమ్ సాంగ్ కోసం ఎంపిక చేయబోతున్నారట. మరి ఈ ఇద్దరిలో ఎవరు పుష్పమూవీలో ఐటెమ్ సాంగ్ లో నర్తిస్తారో చూడాలి.