అభిరుచితో పాటు ప్రతిభ కలిగిన కొత్తవాళ్లను చిత్రపరిశ్రమ ఎంతగానో ప్రోత్సహిస్తోంది. దానిని స్ఫూర్తిగా తీసుకుని సినీరంగంలోకి అడుగుపెట్టిన నాగవర్మ తన సత్తా చాటాలనుకుని హీరోగా పరిచయం కాబోతున్నారు. అంతేకాదు నిర్మాతగా కూడా మారారు. ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ పతాకంపై ‘విక్రమ్’ పేరుతో ఓ ప్రేమ కధా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరిచందన్ దర్శకత్వం వహిస్తున్నారు. . హీరో నాగవర్మ సరసన దివ్యా రావు కథానాయికగా నటించింది. త్వరలోనే సినిమా విడుదల కానుది. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు తేజ హైదరాబాద్ లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ “లవ్ థ్రిల్లర్ చిత్రమిది. ఓ సినిమా రచయిత ప్రేమకధ ఇది. చాలా విభిన్నంగా ఉంటుంది”” అని తెలిపారు. హీరో, నిర్మాత నాగవర్మ మాట్లాడుతూ “థియేటర్లు ఓపెన్ చేసిన తర్వాత చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. నాగవర్మ, దివ్యా రావు జంటగా నటించగా.. సూర్య, జ్యోతి, తాగుబోతు రమేష్, టార్జాన్, ఫిష్ వెంకట్, చిత్రం బాష, ఓం, పృథ్వి రాజ్, సురేష్, చలపతిరాజు, ఖయ్యుమ్, భూపాల్ రాజు, డాన్స్ సత్య, జయవాణి తదితరులు ఇతర ముఖ్యతారాగణం. సంగీతం: సురేష్ ప్రసాద్, ఛాయాగ్రహణం: వేణు మురళీధర్, ఫైట్స్: శివప్రేమ్, ఎడిటర్ మేనగ శ్రీను, నిర్మాత: నాగవర్మ, దర్శకత్వం హరిచందన్.











