తెలుగు సినిమాలకి సరికొత్త నాంది పలికాడు నాని అంటూ తన లేటెస్ట్ మూవీ వి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఎనౌన్స్ మెంట్ అయినప్పుడూ అంతా తెగ పొగిడేశారు. దీంతో వి సినిమా పై జనాల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు నాని నుంచి గతంలో మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు రావడంతో వి రిలీజ్ కోసం అంతా ఎదురుచూశారు. అయితే ప్రస్తుతం వి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది. అయితే ఇలా అమెజాన్ వారు ఈ చిత్రాన్ని అప్ లోడ్ చేసిన 2 గంటల్లోనే వి మీద వెర్డిక్ట్ లు వచ్చేశాయి. అటు విమర్శకులు, ఇటు ప్రేక్షకులు ‘వి’ని డిజాస్టర్ గా డిక్లేర్ చేసేశారు. నాని, ఇంద్రగంటి కెరీర్స్ ది వరస్ట్ మూవీగా వి మీద వస్తున్న కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తున్నాయి.
నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే ఫీలింగ్ కలుగుతుంది జనాలకి. కానీ వి ని చూసిన వారంతా నాని ఎందుకు ఈ సినిమా చేశాడంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇక వి ని డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేసిన అమెజాన్ వారు మళ్లీ మోసపోయారు అనే చెప్పాలి. సినిమా బిజినెస్ విషయంలో తల పండిపోయిన దిల్ రాజు లాక్ డౌన్ టైమ్ లో కూడా అమెజాన్ వారికి వి ని ఎక్కువ రేటుకి అమ్మేసి లాభాలు తెచ్చుకున్నాడు. వి ని చాలా న్యాక్ గా వదిలించేసుకున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.











