ఛాలెంజింగ్ పాత్రలొస్తే .. ఫిజికల్లీ ఛాలెంజెడ్ పాత్రలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు ఇప్పటి సౌత్ బ్యూటీస్. రొటీన్ పాత్రల నుంచి తప్పించుకోవడానికి, తమలోని నటనా సామర్ధ్యాన్ని నిరూపించుకోడానికి దీన్నో సదావకాశంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు దక్షిణాది భామలు .. ఆ రూట్లో ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి క్రేజీ స్టార్స్ అలాంటి పాత్రలు ఎప్పడొస్తాయా? ఏ దర్శకుడు అలాంటి కథలు చెబుతారా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ కోవలో ఇద్దరు భామలకు మూగ, చెవుడు పాత్రలు పోషించే అవకాశం దక్కింది . ఆ ఇద్దరూ ఎవరో కాదు… అనుష్క, సమంత.
అందాల అనుష్క ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ లేకపోతే.. ఈ ఏప్రిల్ 2న థియేటర్స్ లో విడుదల కావాల్సిన సినిమా. వస్తాడు నా రాజు ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో కోనవెంకట్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అతి త్వరలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కానున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో అనుష్క ఒక చిత్రకారిణి. పుట్టు మూగ, చెవుడు ఆమె బలహీనత. ఒకరోజు ఆమె ఒక మర్డర్ ను తన కళ్ళారా చూస్తుంది. కానీ దాన్ని తను చూసినట్టు ఎలా ఎక్స్ ప్రెస్ చేయగలదు? హంతకుడి స్కెచ్ గీసి .. పోలీసులకిస్తే.. ప్లాబ్లెమ్ సాల్వ్ అయిపోతుంది.
అలా చేసే ప్రాసెస్ లోనే ఆమెకు అసలు సమస్య మొదలవుతుంది. ఈ సినిమాకి అనుష్క డఫ్ అండ్ డంబ్ అభినయమే హైలైట్ కానుందని తెలుస్తోంది. ఇందులో తమిళ హీరో మాధవన్ ప్రధాన పాత్ర పోషించాడు.
రీసెంట్ గా అక్కినేని వారి కోడలు సమంత.. ఒక తమిళ సినిమాకి సైన్ చేసింది. దీనికి అశ్విన్ శరవణన్ దర్శకుడు. తాప్సీ నటించిన గేమ్ ఓవర్ సినిమా అతడికి డెబ్యూ మూవీ. ఆ తర్వాత ఇదే దర్శకుడు నయనతార తో ‘మాయ’ అనే సినిమా తీశాడు. ఈ రెండూ హారర్ మూవీసే. కాగా.. ఇప్పుడు ఇదే దర్శకుడు సమంతో తీయబోతున్న సినిమా కూడా హారర్ థ్రిల్లరే అవడం విశేషం.
ఇందులో సమంతా మూగ, చెవుడు అమ్మాయిగా నటించబోతోందట. విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సినిమా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. అయితే ఈ ఇద్దరి కన్నా ముందే.. అందాల నయనతార తమిళంలో ఒక సినిమాలో మూగ, చెవుడు అమ్మాయిగా నటించి మెప్పించింది. సినిమా పేరు ‘నానుమ్ రౌడీదాన్’. ఇందులో విజయ్ సేతుపతి హీరో. ఇదే సినిమా తెలుగులో ‘నేనూ రౌడీనే’ గా విడుదలవగా.. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
తనను ఇబ్బంది పెడుతోన్న ఒక రౌడీ (పార్తీబన్ ) ని చంపమని .. విజయ్ సేతుపతికి నయనతార సుపారీ ఇస్తుంది. కామెడీగా సాగుతునే సీరియస్ టర్న్ తీసుకొనే కాన్సెప్ట్ అది. ఇందులో నయనతార అభినయం దక్షిణాది ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. మరి.. అనుష్క, సమంత తమ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారో చూడాలి.











