ఆర్ఆర్ఆర్ చిత్రం దూకుడుగా ప్రమోట్ చేస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ వాయిదా పడడంతో ప్రమోషన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా పాన్ ఇండియా సినిమాల విడుదల ఆగిపోయాయి. ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ విడుదల ఆగిపోవడంతో చరణ్ తదుపరి చిత్రం ఆచార్య పై దృష్టిపెట్టాడు. ఈ భారీ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు.
ఆచార్య తర్వాత చరణ్.. గ్రేట్ డైరెక్టర్ శంకర్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి రావడం.. ముంబైలో షూటింగ్ చేయడం కూడా జరిగింది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇది చరణ్ 15వ చిత్రం కాగా, దిల్ రాజుకు 50వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా తర్వాత చరణ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది.
అయితే.. ఈ చిత్రంలో కథానాయికగా దిశా పటాని అయితే.. బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. దిశా వరుణ్ తేజ్ లోఫర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. అలాగే ఆమె బాలీవుడ్ చిత్రాలలో కూడా చాలా మంచి పాత్రలు పోషించింది. దిశా ఫిట్ పర్సన్. అలాగే మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ గురించి బాగా తెలుసు. ఈ సినిమా కథ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం కావడంతో హీరోయిన్ పాత్రకు దిశా సరైన ఎంపిక అని మేకర్స్ ఫిక్స్ అయ్యారని సమాచారం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. మరి.. త్వరలోనే అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.











