కేసీఆర్‌తో జగన్ కుమ్మకై ఏపీ కరోనా బాధితుల ప్రాణాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీ నుంచి రోగులను తీసుకువెళ్తున్న అంబులెన్సులను ఆపేయడంతో పెరుగుతున్న మృతులకు కారణం అయిన తెలంగాణా పాలకులు, పోలీసులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాజధాని, రూ.5 వేలకోట్ల ఆస్తులను సొంతం చేసుకుని ప్రాణాపాయంలో ఉన్న రోగిచికిత్సకు అనుమతివ్వకపోవడం దారుణం, కోర్టు ధిక్కారమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆంక్షల వల్ల ఏపీ కరోనా బాధితుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా జగన్ ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే కేసీఆర్ తో చర్చలు జరిపి వెంటనే అంబులెన్స్ కు అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నాదెండ్ల బ్రహ్మం డిమాండ్ చేశారు. అంబులెన్స్ ఆంక్షలపై నారా లోకేశ్ కూడా మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ మొద్దు నిద్ర వీడి, చర్చలు జరపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్పై అమిత్ షా కామెంట్స్.. వైసీపీకి డేంజర్ బెల్స్…!!
కేంద్ర హోం శాఖ మంత్రి హోదాలో బీజేపీ కీలక నేత అమిత్ షా...మొన్నటి...