కోవిడ్ వ్యాక్సిన్ పేరుతో పలు రకాల మందుల అమ్మకాలపై సుప్రీం కోర్టులో విచారణ చేపట్టాలంటూ పిల్ వేసిన ప్రముఖ న్యాయవాది ఎంఎల్ శర్మ. ఈ క్రమంలోనే 10 ఫార్మా కంపెనీలపై విచారణ జరపాలంటూ పిల్ లో కోరారు. రెమిడిసివిర్, ఫెవిపిరవిర్ వంటి ధృవీకరించని ట్రయల్ మందులను కరోనా వ్యాక్సిన్ గా ఉపయోగించకుండా చూడాలని కోరిన పిటిషనర్. వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల షాపులలో కూడా వీటిని విక్రయించకూడదని ఆయన పిల్ లో పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వీటిని ఉపయోగించాలన్న నిబంధన ఉందని తెలిపిన పిటిషనర్. కానీ అన్ని సందర్భాల్లో వీటిని ఉపయోగిస్తున్నారంటూ ఆరోపించారు. ఇప్పటికే రెమిడిసివిర్ మందు కరోనా రోగులపై పని చేయడం లేదన్న డబ్ల్యూహెచ్ వో నివేదికను కోర్టుకు సమర్పించిన శర్మ. ఒకసారి వాడినప్పుడు మందు పనిచేయకపోవడంతో మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నారు. దీని వలన వ్యక్తులకు కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ ఆయన పేర్కొన్నారు.
డబ్ల్యూహెచ్ వో నివేదికను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్తామన్న సుప్రీం కోర్టు. న్యాయవాది శర్మ పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు. దీనిపై వెంటనే సమాధానం చెప్పాలంటూ కేంద్రాన్ని కోరిన సుప్రీం కోర్టు.