తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న రోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆడిన నాటకం బీఆర్ఎస్ పార్టీకి ఎనలేని నష్టాన్ని తెచ్చిపెట్టినట్లుగా తెలుస్తోంది. సరిగ్గా ఎన్నికల రోజు ఇంకొద్దిసేపట్లో పోలింగ్ మొదలవుతుందనగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర ఆడిన నాటకం.. సామాన్య ప్రజలకు కూడా ఇట్టే అర్థమైపోయింది. ఆంధ్రా పోలీసులు 500 మంది దౌర్జన్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గరికి రావడం.. అక్కడి ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బందిని భయపెట్టి సగం గేట్లు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు నటించడం అంతా సవ్యంగానే జరిగింది. కాకపోతే పోలింగ్ రోజు జరిగిన ఈ తతంగం బీఆర్ఎస్‌కు లాభం చేకూర్చకపోగా, నష్టాన్ని తెచ్చిపెట్టిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఏపీ, తెలంగాణ మధ్య గత మొదటి నుంచి నీళ్ల పంచాయితీ ఉన్న సంగతి తెలిసిందే. క్రిష్ణా నదీ జలాల విషయంలో కొట్లాట ఎన్నటికీ తెగడం లేదు. దాన్నే తాజాగా తమకు అనుకూలంగా బీఆర్ఎస్ వాడుకున్నట్లుగా అర్థం అవుతుంది. ఆంధ్రా పాలకులు దౌర్జన్యంగా నీటిని ఎత్తుకుపోతున్నారనే సందేశాన్ని నాగార్జున సాగర్ ఉద్రిక్తతల ఘటనలో చాటారు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే ఏపీని సమర్థంగా ఎదుర్కోలేదని, తాము మాత్రమే ఏపీ నుంచి రావాల్సిన వాటిని సక్రమంగా రాబడతామని, తెలంగాణ హక్కులను కాపాడతామనే సంకేతాలు పంపారు. కానీ, అవి వర్కౌట్ అయినట్లుగా కనిపించడం లేదు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద జరిగిన ఉద్రిక్తత పరిస్థితులు మొత్తం డ్రామా అనేందుకు చాలా కారణాలు లేకపోలేదు. సాధారణంగా నీటి సమస్య ఉంటే కొద్ది రోజుల ముందు నుంచే ఇరు రాష్ట్రాల నీటి పారుదల అధికారుల మధ్య లేఖల పంపకాలు ఉండేవి. లేదా ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశాలు జరుపుకోవడం లాంటి పరిణామాలు ఉండేవి. కొద్ది రోజులుగా అవేమీ వినిపించలేదు. ఇవేమీ లేకుండా నేరుగా ప్రాజెక్టు వద్దకు దండయాత్రకు వచ్చినట్లుగా రావడం లాంటి పరిస్థితులు ఎక్కడా ఉండవు. సడెన్ గా సరిగ్గా కొద్ది గంటల్లో పోలింగ్ మొదలవుతుందనగా, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద జరిగిన హైటెన్షన్ ను మొదలు పెట్టారు. అది నిజమే అని బలం చేకూర్చే విధంగా ఏపీ నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబు తాగు నీటి కోసం ఏపీ అధికారులు గేట్లు వదలబోతున్నారని ఓ పోస్టు చేశారు. నిజానికి తాగునీటి కోసం అంటే.. ఏ రాష్ట్రమైనా నీటి విడుదలకు ఒప్పుకోకుండా ఉండదు. మొత్తానికి లాజిక్ లేకుండా కేసీఆర్ – జగన్ ఆడిన నాటకం.. బీఆర్ఎస్‌కి నష్టమే తెచ్చిపెట్టినట్లుగా కనిపిస్తుంది











