తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో చాలా సర్వే సంస్థలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. ఇప్పుడు ఇదే అన్నీ రాజకీయ పార్టీని కలవర పెడుతున్నాయి.
తెలంగాణ ఎన్నికల సరళిపై జాతీయ, స్ధానిక సర్వే ఏజెన్సీలు, వ్యూహకర్తలు, జాతీయ మీడియా సంస్ధలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగానే ఇచ్చేశాయి. అయితే వీటిలో ఓ సర్వే సంస్థ మాత్రం కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపింది. అదే స్మార్ట్ పోల్ సర్వే సంస్థ. ఆ సంస్థ తమ ఫలితాలను వెల్లడించింది. ఈ ఎన్నికల్లో ఆ సంస్థ కాంగ్రెస్ కు 70 నుంచి 80 సీట్ల మధ్యలో రావచ్చని తెలిపింది. అనేక సంస్థలు తమ సర్వే ఫలితాలను ప్రకటించినా అందరికన్నా ఎక్కువ సీట్లు రావచ్చని తెలిపింది మాత్రం స్మార్ట్ పోల్ సర్వేనే. మూడు దశలుగా ఈ సంస్థ సర్వే నిర్వహించడమే కాకుండా దాదాపు 66 నియోజక వర్గాల నుంచి 7500 శాంపిల్స్ తో ఎగ్జిట్ పోల్స్ చేసింది.
అయితే సర్వే చేసిన విధానం.., ఇచ్చిన ఫలితాలను అందర్ని ఆలోచించేలా చేస్తున్నాయి. మొదటిగా స్మార్ట్ పోల్ సర్వే .. ఈ ఏడాది సెప్టెంబరు 4 నుంచి 30 వరకు చేసింది. అప్పుడు 42 నియోజక వర్గాల నుంచి 30 వేల శాంపిల్స్ సేకరించి విశ్లేషణ జరిపింది. ఆ తర్వాత 2వ దశ సర్వేను అక్టోబరు 26న ప్రారంభించి నవంబరు 11 వరకు కొనసాగించింది. ఒకవిధంగా ఇది ప్రీ నామినేషన్ స్టేజ్ అనాల్సి ఉంటుంది. అప్పుడు 65 నియోజక వర్గాల నుంచి 28 వేల శాంపిల్స్ సేకరించింది. ఇక మూడో దశ సర్వేను నవంబరు 14న మొదలు పెట్టి 28 వరకు జరిపింది. అంటే ఎన్నికలు జరగడానికి రెండు రోజుల ముందువరకు. దాదాపు 68 నియోజక వర్గాల నుంచి 30 వేల శాంపిల్స్ సేకరించి అంతకుముందు చేసిన రెండు దశల సర్వేలతో కలపి విశ్లేషించింది. ప్రశ్నలేమీ అడగకుండా కేవలం సీక్రెట్ బ్యాలెట్ నిర్వహించడం తమ సర్వే ప్రత్యేకత అని స్మార్ట్ పోల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీనివాసరావు తెలిపడం ఆలోచింపజేస్తోంది.
తటస్థ ఓటర్ల నుంచి మాత్రమే ఇలాంటి సమాచారం సేకరించినట్టు ఆయన చెప్పారు. మొత్తం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 113 నియోజకవర్గాల నుంచి సర్వే చేశామని.., ఒకటి రెండు సార్లు పరిశీలన చేసి ఈ ఫలితాలు తయారు చేసినట్టు ఆయన చెబుతున్నారు. ఒక్క ఎంఐఎంకు చెందిన ఆరు నియోజక వర్గాల్లో మాత్రమే ఎలాంటి సర్వే చేపట్టలేదన్నారు. అయితే ఈ సర్వేలో తెలిన ఎగ్జిట్ పోల్స్ లో బీఆర్ఎస్ పార్టీకి 30 సీట్లు 37.75 ఓటింగ్ శాతం, కాంగ్రెస్ కు 76 సీట్లు, 40.50 శాతం, బీజేపీకి 5 సీట్లు, 13.50 శాతం, బీఎస్పీకి – 1 సీటు, 2.15 శాతం, సీపీఐకి 1 సీటు, 0.30 శాతం, ఏఐఎంఐఎంకి 6 సీట్లు, 2.65 శాతం రాబోతున్నాయని చెప్పేశారు. ఈ సర్వేనే ప్రగతి భవన్ లో ప్రకంపనలు సృష్టించగా.., గాంధీ భవన్ లో ఫుల్ జోష్ ను నింపుతున్నాయి.











