డ్రగ్స్ కేసు.. మొదట అల్పపీడనం మాదిరిగా ప్రారంభమైంది.. ఆ తర్వాత వాయుగుండం, తుపాను.. ఇప్పుడు పెను తుపాను రూపానికి చేరింది. ఈ కేసు ఎందరి జీవితాలను కుప్పకూల్చనుందో ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం. పెద్ద వట వృక్షాలే ఈ పెను తుపాను ధాటికి కూలిపోయేలా ఉన్నాయి. రోజుకో కొత్త పేరును తెరపైకి తెస్తూ నేషనల్ మీడియా కోడై కూస్తోంది.. తమ జీవితాలు తెల్లారిపోతాయేమోనని అందరూ తల్లడిల్లిపోతున్నారు. ప్రస్తుతం ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ ల మాదిరిగా ఉన్నాఎప్పుడు తమ పేరు తెరపైకి వస్తుందో అని ఇలాంటి అలవాటు ఉన్న అందరూ భయపడుతున్నారు.
డ్రగ్స్ అలవాటు సినిమా రంగంలో ఎంతలా వేళ్లూనుకుందో తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాపేర్లు బయటికి వచ్చినంత మాత్రాన వారు దోషులు కాకపోయినా మీడియా తమ పేర్లు బయటికి రావడంతో ఆందోళన చెందుతున్నారు. నిన్ననే శ్రద్ధా కపూర్, సారా లకు విచారణకు హాజరు కావలసిందిగా సమన్లు అందాయి. తెలుగు హీరోయిన్ రకుల్ కు మాత్రం ఇంకా సమన్లు అందలేదు. తాజాగా బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకునే పేరు తెరపైకి వచ్చింది. అంతకుమించి తెలుగు సూపర్ స్టార్ మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ పేరు కూడా మీడియాలో రావడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. మరో బాలీవుడ్ నటి దియా మీర్జా పేరు కూడా లిస్టులో ఉందంటున్నారు.
వీరి ఫోన్ ఛాటింగ్ అంతా పొడి అక్షరాలతో సాగింది. అర్థం కాకుండా కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడినట్లు ఉంది. టాలెంట్ మేనేజర్ జయ సాహోతో నమ్రత ఛాటింగ్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. డ్రగ్స్ సప్లయిర్ గా ఉన్న జయ షా వాట్సాప్ చాట్ ఇప్పుడు బయటకు వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత పేరు ఉందంటూ ప్రముఖ హిందీ ఛానల్ ఆజ్ తక్ స్టోరీ చేసింది. డి అంటే దీపిక, ఎన్ అంటే నమ్రత, కె అంటే కరిష్మా ప్రకాష్, ఎస్ అంటే శ్రద్ధా కపూర్ గా భావిస్తున్నారు. వీటిని డీకోడ్ చేసి ఈ పేర్లను తెరపైకి తెచ్చారు. తెలుగులో మహేష్ బాబుకు ఎంత పెద్ద పేరుందో అందరికీ తెలుసు. ఒకప్పుడు ఆమె హీరోయిన్. ఈ ఆరోపణ మీద స్పందించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. మీడయా కూడా ఈ పేర్లను బాహాటంగా ప్రకటించడానికి మీడియా కూడా సాహసించడం లేదు.