ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో హీరో నాగార్జున భేటీ వెనక మతలబు ఏమై ఉంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశం. ‘ఊరక రారు మహానుభావులు’ అన్నట్లుగానే ఈ వ్యవహారం ఉంది. ఇది వ్యక్తిగతమైన కలయికే తప్ప సినిమా పరిశ్రమకు ఎంత మాత్రమూ సంబంధం లేదు. మరి ఆ వ్యక్తిగత అంశం ఏమై ఉంటుంది అన్నది ఇంకో ప్రశ్న. అక్కినేని నాగార్జునతోపాటు నిర్మాతలు ప్రీతం రెడ్డి, నిరంజన్ రెడ్డి కూడా భేటీలో పాల్గొన్నారు. వీరిద్దరిలో నిరంజన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తరపున అక్రమాస్తులు కేసులు వాదించే లాయర్.
ఆయన ప్రస్తుతం చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా నిర్మిస్తున్నారు. గతంలో కూడా అనేక సినిమాలు తీశారు. వీరంతా దేనిపై చర్చించారు అన్నదానిపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ‘వైఎస్ జగన్ నా శ్రేయోభిలాషి.. అందుకే కలిశా’ అంటున్నారు నాగార్జున. కలిసి భోజనం కూడా చేశారనుకోండి. ప్రధానంగా రెండు అంశాల కోసమే వీరు జగన్ ను కలిసినట్టు ఊహాగానాలు ఉన్నాయి. వాటిలో ఒకటి నాగార్జునకు నూజివీడులో ఉన్న ఆరు ఎకరాల భూముల అంశం. ఈ భూముల వివాదంపై కోర్టు నుంచి నాగార్జునకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. సత్వరమే ఆ భూములు తనకు దక్కడానికి అవసరమైన అనుమతుల కోసం నాగార్జున సీఎంను అడిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇంకోటి నాగార్జున తన సన్నిహిత మిత్రుడు, వ్యాపార భాగస్వామి నిమ్మగడ్డ ప్రసాద్ కు సంబంధించిన అంశం కూడా అయిఉండవచ్చంటున్నారు. వాన్ పిక్ భూముల విషయంలో నిమ్మగడ్డ ప్రసాద్ గతంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు నాగార్జున కూడా వెళ్లి తరచూ ఆయనను కలిశేవారు. జగన్ తో నాగార్జునకు సాన్నిహిత్యం ఏర్పడటానికి కారణం కూడా నిమ్మగడ్డ ప్రసాదే. కాబట్టి సినిమా రంగ సమస్యలపై మాత్రం వీరు జగన్ కు కలవలేదని స్పష్టమవుతోంది. మొత్తానికి వ్యక్తిగత అంశాలే ఎజెండాగా వీరి భేటీ జరిగినట్టు తెలుస్తోంది.
Must Read ;- డ్రగ్స్ డెన్‌గా ఏపీ మారుతోందా?











